ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్‌జేసీ సెట్) కు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఏపీఆర్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: పదో తరగతి పరీక్షలకు హాజరైన వారు మాత్రమే.
క్యాంపస్‌లు: నాగార్జునసాగర్, కొడిగెనహళ్లి, నిమ్మకూరు, వెంకటగిరి, గ్యారంపల్లి, సర్వేల్, తాటిపూడి, బనవాసి, హసన్‌పర్తి, గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, హైదరాబాద్, వాయల్పాడు.
ఇంగ్లిష్ మీడియం: నాగర్జున సాగర్, కొడిగెనహళ్లి, నిమ్మకూరు.
ఇంగ్లిష్, తెలుగు మీడియంలో బోధించే కళాశాలలు: వెంకటగిరి, గ్యారంపల్లి, సర్వేల్, తాటిపూడి, బనవాసి, హసన్‌పర్తి.
ముస్లిం మైనార్టీ బాలురు: గుంటూరు, కర్నూలు, నిజామాబాద్, హైదరాబాద్
ముస్లిం మైనార్టీ బాలికలు: చిత్తూరు
ముస్లిం మైనార్టీ కళాశాలల్లో ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం కళాశాలల్లో బోధిస్తారు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా... రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలు/ కళాశాలలు/ విద్యాశాఖాధికారి కార్యాలయాలు/ గురుకుల విద్యాలయ సొసైటీల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తుల్ని To, The Convenor, APRJC CET- 2013, APREI Society, Gaganvihar, 4th Floor, M.J. Road, Nampally, Hyderabad- 500001 చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 29 మార్చి, 2013
దరఖాస్తు చేసేందుకు చివరితేది: 17 ఏప్రిల్, 2013
ప్రవేశ పరీక్ష తేదీ: మే 15, 2013