183 ఇంజనీరింగ్ కాలేజీల్లో 91,998 సీట్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 91,998 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చిన కాలేజీలు, సీట్ల సంఖ్యను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది.
Edu newsజూలై 5 తర్వాత వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో యూనివర్సిటీలు ఇచ్చిన అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి ఉన్నత విద్యా మండలి పంపించింది. మొత్తంగా ఈసారి 183 ఇంజనీరింగ్ కాలేజీల్లో 91,988 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 14 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లోని 3,055 సీట్లు పోగా, ప్రైవేటు కాలేజీల్లో 88,933 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు కాలేజీల్లోని 70 శాతం, ప్రభుత్వ కాలేజీల్లోని 100 శాతం సీట్లు కలుపుకొని మొత్తంగా 65,308 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులోకి రానున్నాయి. 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో 26,680 సీట్లు ఉండనున్నాయి. ఇంజనీరింగ్‌లో గతేడాది సీట్లతో పోల్చితే ఈసారి 15 కాలేజీలు తగ్గిపోగా, 3,247 సీట్లు తగ్గిపోయాయి.

వర్సిటీల వారీగా రానున్న సీట్లు..
యూనివర్సిటీ కాలేజీలు సీట్లు
జేఎన్‌టీయూ 157 81,009
కేయూ 8 2,565
మహాత్మాగాంధీ 1 180
ఓయూ 15 8,180
అగ్రికల్చర్ యూనివర్సిటీ 2 54
Published on 7/2/2019 2:58:00 PM

Related Topics