ఎస్‌బీఐ అసోసియేట్ బ్యాంక్స్ పీఓ ప్రిపరేషన్ ప్లాన్


Bavitha ఉద్యోగార్థుల కల్పతరువు బ్యాంకింగ్ రంగం. ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పిస్తూ అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, ఆర్థిక రంగానికి ఊతమిచ్చే ప్రకటనలు, ప్రధానమంత్రి జన-ధన యోజన వంటి పథకాలతో బ్యాంకులు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అధిక సంఖ్యలో పదవీ విరమణలు, అందరికీ బ్యాంక్ అకౌంట్ కల్పించాలనే లక్ష్యంతో శాఖల విస్తరణ నేపథ్యంలో బ్యాంకుల్లో నియామకాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకుల్లో 2986 పీఓ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

బ్యాంకులో ఉద్యోగం అంటే నిజంగా ఒక సువర్ణావకాశం. నిజాయితీ, పనిపట్ల శ్రద్ధ, అంకితభావం ఉంటే సాఫీగా సాగే తిరుగులేని కెరీర్ బ్యాంకింగ్. కానీ ఈ పరీక్షలకు పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సాధారణ డిగ్రీ మొదలుకొని ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, ఎంబీఎ ఎంసీఎ, ఎంటెక్ ఇలా అన్ని రకాల గ్రాడ్యుయేట్లు పోటీపడతారు. లక్షల మంది పోటీ పడే ఈ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి కూడా కఠినంగానే ఉంటుంది. నిరంతర సాధన ఉంటే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయడం కష్టం. కాబట్టి పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ మొదలు పెట్టి సన్నద్ధమవ్వాలి.

బ్యాంకుల వారీగా ఖాళీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్

350

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్

900

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్

500

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా

100

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్

1136

మొత్తం

2986కేటగిరీలవారీగా ఖాళీలు

ఎస్సీ

415

ఎస్టీ

533

ఓబీసీ

743

జనరల్

1295

మొత్తం

2986పరిమిత అటెంప్ట్‌లు:

జనరల్

4

జనరల్ (పీడబ్య్లూడీ)

7

ఓబీసీ, ఓబీసీ(పీడబ్య్లూడీ)

7

ఎస్సీ, ఎస్టీ, (పీడబ్య్లూడీతో సహా)

పరిమితి లేదుఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కరీంనగర్, ఖమ్మం, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్.

వేతనం-విధులు: రూ.14,500 బేసిక్‌పేతో పాటు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, సీసీఏ, న్యూస్ పేపర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ వంటి ఇతర సదుపాయాలు కలుపుకొని ప్రారంభ వేతనం దాదాపు 35 వేలుంటుంది. అదే ముంబై లాంటి నగరాల్లో అయితే రూ.65 వేల దాకా ఉంటుంది. అంతేకాక వైద్యం, రవాణా సదుపాయాలతో పాటు గృహ, వాహన, వ్యక్తిగత లోన్ సదుపాయాలు కూడా ఉంటాయి. పై అన్ని సదుపాయాలకు మించి ఉద్యోగ భద్రత ఉంటుంది.

పరీక్ష విధానం: ఎస్‌బీఐ అసోసియేట్ బ్యాంక్స్ పీఓ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశ రాత పరీక్ష. రెండో దశ గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ.

ఫేజ్ - 1 (250 మార్కులు): దీనిలో తిరిగి రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అవి
  1. ఆబ్జెక్టివ్ టెస్ట్ (200 మార్కులు)
  2. డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు)
ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా కంప్యూటర్‌లోనే ఉంటాయి. అభ్యర్థులు ప్రశ్నలు చూసి పేపర్‌పై తమ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షకు సమయం 2 గంటలు. డిస్క్రిప్టివ్ పరీక్షకు ఒక గంట.
ఈ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి అవి.

విభాగం

ప్రశ్నలు

మార్కులు

జనరల్ ఇంగ్లీష్ (గ్రామర్, వొకాబులరీ, కాంప్రెహెన్షన్ ప్యాసేజ్)

50

50

జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్, కంప్యూటర్స్

50

50

డాటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్

50

50

రీజనింగ్ (హై లెవెల్)

50

50

మొత్తం

200

200


ఫేజ్ 2: ఈ దశలో తిరిగి రెండు పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి...
  1. గ్రూప్ డిస్కషన్ (20 మార్కులు)
  2. ఇంటర్యూ (30 మార్కులు )
ప్రిపరేషన్ టిప్స్: బ్యాంకు పరీక్షల్లో వేగం సమయపాలన ప్రధానమైనవి. ఒక్కొక్క ప్రశ్నకు సరాసరిన నిమిషంలో 3/5 వ వంతు మాత్రమే సమయం ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించాలంటే సాధన ఒక్కటే షార్ట్ కట్. అభ్యర్థులు వారి మిత్రులతో కూడి గ్రూప్‌గా సాధన చేస్తే ఉపయోగం ఉంటుంది. ప్రశ్నను చదివి, అర్థం చేసుకొని, విశ్లేషించే సమయాన్ని వీలైనంత కుదించగలిగితే సులభంగా అర్హత మార్కులు సాధించవచ్చు.

జనరల్ ఇంగ్లీష్ (50 మార్కులు): ఈ విభాగంలో రీడింగ్ కాంప్రహెన్సెన్, సినానిమ్స్, ఆంటొనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆడ్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ప్రేజెస్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్ లేదా జంబుల్డ్ సెంటెన్స్, క్లోజ్ టెస్ట్ (CLOZE READING TEST), అనాలజీ, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. రోజూ 10 కొత్త పదాలు నేర్చుకొని వాటిని వాక్యాల్లో ఉపయోగించడం సాధన చేయాలి. సందేహం ఉన్న పదాలు వెంటనే డిక్షనరీ సహయంతో నివృత్తి చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాకరణ తప్పులు, వాక్య దోషాలు, వాక్య నిర్మాణంపై దృష్టి పెట్టాలి. అక్షర దోషాలు లేకుండా వ్యతిరేక పదాలు, సమానార్థాలు, వీలైనన్ని ఎక్కువగా చదవాలి. వీటి వల్ల వొకాబులరీ అభివృద్ధి చెందటంతో పాటు సరైన ఉచ్ఛారణ అలవడుతుంది. ఇది గ్రూప్ డిస్కషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. స్పాటింగ్ ద ఎర్రర్స్ ప్రశ్నలు సాధించాలంటే టెన్సెస్ బాగా తెలిసుండాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే వే గంగా చదవడం అలవాటు చేసుకోవాలి. చదువుతున్నప్పుడే కీలక పదాలను అండర్‌లైన్ చేసుకోవాలి. వీటితో పాటు పార్‌‌ట్స ఆఫ్ స్పీచ్, ప్రిపొజిషన్స్, ఆర్టికల్స్ సాధన చేయాలి. ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం లేదా ప్రముఖ ఛానల్‌లో వచ్చే గ్రూప్ డిస్కషన్లను చూసి విని నేర్చుకోవడం చాలా అవసరం.

జనరల్ అవేర్‌నెస్, మార్కెటింగ్ అండ్ కంప్యూటర్స్:
జనరల్ అవేర్‌నెస్‌కి పరీక్ష తేదీకి గత పది నెలల కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. వీటిలో అంతర్జాతీయ సంఘటనలు, ద్వైపాక్షిక సంబంధాలు - నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, తాజా నియామకాలు, అవార్డులు-గ్రహీతలు, వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు - విజేతలు, సదస్సులు - సమావేశాలు, కొత్త పుస్తకాలు - రచయితలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు ముఖ్యమైనవి. అవి కూడా మన చుట్టూ నిత్యం జరుగుతున్న సంఘటనల నుంచే కాబట్టి రోజూ దినపత్రిక చదవడం వల్ల సమకాలీన, వర్తమాన అంశాలపై అవగాహన పెరుగుతుంది. దీని వల్ల బ్యాంకింగ్, వ్యాపార రంగానికి చెందిన లేటెస్ట్ అప్‌డేట్స్ కొత్త పథకాలు, స్టాక్ మార్కెట్, తాజా వాణిజ్య ఉప్పందాలు కూడా చదివినట్లవుతుంది. అలాగే స్టాక్ జీకే నుంచి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

మార్కెటింగ్‌కు సంబంధించి ఏదో ఒక స్టాండర్డ్ పుస్తకాన్ని చదవాలి. మార్కెట్, అడ్వర్‌టైజింగ్, సేల్స్, ప్రొడక్షన్, బ్రాండ్, కస్టమర్, కస్టమర్ పర్‌సెప్షన్, మార్కెటింగ్ స్ట్రాటజీ, కొత్త ప్రాడక్టులు, సంస్థల సేవలు, కొటేషన్స్, సంస్థల అధిపతులు వంటి బేసిక్స్‌ను గుర్తుపెట్టుకోవాలి.

కంప్యూటర్ బేసిక్స్, షార్ట్ కట్‌లు, పదజాలాలు, ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లు, ఈమెయిల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. నిత్య జీవితంలో కంప్యూటర్‌తో ముడి పడి ఉన్న పనులు వాటిలో వాడే పదాలపై అవగాహన ఉండాలి. గతంలో జరిగిన పరీక్షల పేపర్లు చూసుకొని ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.

డాటా ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్
సాధారణంగా ఇతర బ్యాంకు పరీక్షల్లోనూ ఈ విభాగం నుంచి 10 నుంచి 20 దాకా ప్రశ్నలు వస్తాయి. కానీ ఎస్‌బీఐ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్థానంలో పూర్తిగా డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ విభాగాన్ని ప్రవేశపెట్టింది. టేబుల్స్, పై చార్ట్, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, కేస్‌లెట్, డాటా సఫిసియన్సీల రూపంలో ఇచ్చిన డాటాను విశ్లేషణ చేసి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీనికి బేసిక్ ఆరిథ్‌మెటిక్ ఆపరేషన్స్, శాతాలు, సరాసరి, నిష్పత్తి వంటి వాటిపై పట్టుండాలి. డేటా విశ్లేషణలో వేగం పెంచుకోవడం, అధికంగా టేబుల్స్, గ్రాఫ్‌లు సాధన చేయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.

రీజనింగ్ (హైలెవెల్)
రీజనింగ్‌లో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. మామూలుగా నేర్చుకునే కోడింగ్, డీకోడింగ్ తో పాటు లాజికల్ రీజనింగ్ మీద కూడా అధిక దృష్టి పెట్టాలి. స్టేట్‌మెంట్ ఎసంప్షన్స్, స్టేట్‌మెంట్ కాంక్లూషన్స్, డెసిషన్ మేకింగ్, కేస్‌లెట్, స్టేట్‌మెంట్-ఆర్గ్యూమెంట్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్ టెస్ట్స్, సిల్లోజం, వెన్‌డయాగ్రమ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. వీలైనన్ని ఎక్కువ మోడల్ ప్రశ్నలు సరైన పద్దతిలో సాధన చేయడం వల్ల మంచి మార్కులు పొందవచ్చు.
రీజనింగ్, డాటా అనాలసిస్ లో మంచి మార్కులు సాధించాలంటే సాధనే ఒక్కటే మార్గం.

డిస్క్రిప్టివ్ టెస్ట్ (50 మార్కులు): ఈ పరీక్ష ప్రధానంగా కాంప్రెహెన్షన్, ప్రిసైస్ రైటింగ్, లెటర్ రైటింగ్, ఎస్సేలపై ఉంటుంది. ఇందులో ముఖ్యంగా అభ్యర్థుల కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.

కాంప్రెహెన్షన్ ఉద్దేశం ముఖ్యమైన పదాలకు అర్థం తెలుసుకోవడం. ప్రిసైస్ రైటింగ్‌లో ఇచ్చిన అంశాన్ని అర్థం చేసుకొని ముఖ్యమైన పాయింట్లను తిరిగి సొంత పదాలతో రాయడం అవసరం. ఇచ్చినఅంశం అర్థం మారకుండా వీలైనన్ని తక్కువ పదాలతో పూర్తిచేయాలి. లెటర్ రైటింగ్ అన్నిటికంటే చాలా ముఖ్యం. దీనిలో భాషా ప్రావీణ్యం, శాల్యుటేషన్స్ వంటివి వాడటం, అందరికీ అర్థమయ్యే పదాలను ఎంచుకొని ఉత్తరం రాయడం చాలా అవసరం. వీలైనన్ని ఎక్కువ సార్లు ఉత్తరాలు రాసి సరిచూసుకోవడం వల్ల పునరావృతమయ్యే తప్పులను సరిచేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ఏదో ఓ అంశం ఇచ్చి దానిపై వ్యాసం రాయమని అడుగుతారు. దీనిలో వ్యాసం తాలూకు ఉద్దేశం గ్రహించి దాన్నే ప్రధానంగా సంక్షిప్తంగా వ్యాసం రాయాలి. వ్యాసంలో వాడే పదాలు, గ్రామర్ మధ్య సంబంధం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా తాజా సంఘటనలపైనే ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి కరెంట్ ఈవెంట్స్ పై ఎస్సేలు రాస్తూ సాధన చేయాలి. డిస్క్రిప్టివ్ పేపర్‌లో మంచి మార్కులు సాధించాలంటే అభ్యర్థులు ఒకే అంశాన్ని ఎక్కువసార్లు రాస్తూ సాధన చేయాలి.

రిఫరెన్‌‌స బుక్స్:
ఆబ్జెక్టివ్ ఆర్థమెటిక్:
ఎస్ ఎల్ గులాటీ, ఆర్.ఎస్ అగర్వాల్
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఫర్ బ్యాంకింగ్: దిల్షాన్ పబ్లికేషన్స్
డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ అనాలసిస్: కిరణ్ పబ్లికేషన్స్
నాన్ వెర్బల్ రీజనింగ్ : ప్రభాత్ జావేద్
వెర్బల్ రీజనింగ్: ఆర్.ఎస్. అగర్వాల్
ఇంగ్లీష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్: హరిమోహన్ ప్రసాద్, ఎ.కె. కపూర్
మార్కెటింగ్: ఫిలిప్ కోట్లర్
కరెంట్ అఫైర్స్: ఏదైనా తెలుగు(సాక్షి), ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక వెబ్‌సైట్
కంప్యూటర్స్: ఏదైనా ప్రామాణిక పుస్తకం, వెబ్‌సైట్(సాక్షి ఎడ్యుకేషన్.కామ్)
వీటితో పాటు సాధనలు విరణలతో సాక్షి అందించే 7000+ ప్రశ్నల నిధి సాధన చేయడం వల్ల ఉద్యోగం మీ సొంతం.

నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య:
2986
విద్యార్హత: ఏదేనీ డి గ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఉత్తీర్ణత
వయస్సు: సెప్టెంబర్ 1, 2014 నాటికి కనీస వయసు 21. గరిష్ట వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం: సాధారణ అభ్యర్థులకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 100/-
ఫీజు చెల్లింపు: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించేవారు మొదట బ్యాంక్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు పేజీలో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. నిర్ణీత ఫార్మాట్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. పూర్తి వివరాలు నింపిన తర్వాత సబ్‌మిట్ కొట్టాలి. తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు మొబైల్‌కు కన్ఫర్మేషన్ ఎస్సెమ్మెస్ వస్తుంది. అనంతరం జనరేట్ అయ్యే నగదు వోచర్ / చలాన్ డౌన్‌లోడ్ చేసుకొని రెండు పనిదినాల తర్వాత ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేవారు వివరాలు నింపిన తర్వాత ఫీజు చెల్లించేందుకు ఆన్‌లైన్ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత వచ్చే పేమెంట్ గేట్‌వే ద్వారా నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లించవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం:
01 సెప్టెంబర్, 2014
దరఖాస్తులకు చివరి తేది: 18 సెప్టెంబర్, 2014
దరఖాస్తు ఫీజు చెల్లింపు(ఆన్‌లైన్): 01 సెప్టెంబర్, 2014 నుంచి 18 సెప్టెంబర్, 2014 వరకు
దరఖాస్తు ఫీజు చెల్లింపు(ఆఫ్‌లైన్): 03 సెప్టెంబర్, 2014 నుంచి 20 సెప్టెంబర్, 2014 వరకు
హాల్‌టికెట్ డౌన్‌లోడ్: 24 అక్టోబర్, 2014 తర్వాత
వెబ్‌సైట్: https://www.sbi.co.in/

Distribution of Questions in Previous Exams

2010

2013

General Awareness, Computers and Marketing

 

 

Current Affiars (Banking and Financial related)

24

35

Marketing

12

7

Computers

14

8

Total

50

50


Data Analysis and Interpretation

Tables

20

20

Bar Graph

10

5

Pair of Pie Charts

5

5

Caselet

10

10

Line Graphs

5

5

Data Sufficiency

-

5

Total

50

50


English Language

Reading Comprehension

15

15

Fill in the blaks

10

-

Synonyms and Antonyms

5

-

Sentence Arrangement

5

5

Cloze Test

10

15

Sentence correction

5

5

Sentence filler

-

10

Total

50

50

www.sakshieducation.com
Published on 9/1/2014 6:39:00 PM

Comment

Related Topics