Sakshi education logo
Sakshi education logo

టెన్త్ లో ఇంటర్నల్స్ రద్దు: ఆదిమూలపు సురేష్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వాటి రూపురేఖలు మారుస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. జూన్ 20న వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లోకి మంత్రి ప్రవేశించారు.
Edu newsఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై ఇంజనీరింగ్ అధికారులతో జూన్ 20న సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ఇతర అంశాలకు సంబంధించి త్వరలోనే కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వైఎస్సార్ అక్షయపాత్ర ద్వారా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడమే సర్కారు లక్ష్యమని చెప్పారు. మంత్రి సురేష్ జూన్ 20న మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఎస్‌జీటీ నుంచి హెడ్మాస్టర్ల వరకు దాదాపు 19 వేల మందికి పదోన్నతులు కల్పించేందుకు అనుమతిస్తూ తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో 2019-2024 విద్యా విధానం దశదిశ నిర్దేశించేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు వీలుగా మరో ఫైల్‌పై సంతకం చేశారు. సీసీఈ విధానంలో ప్రస్తుతం పదో తరగతిలో కొనసాగుతున్న 20 మార్కుల అంతర్గత మార్కులను రద్దు చేస్తూ మూడో సంతకం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

టెన్త్లో ఇంటర్నల్స్ రద్దు :
ఈ విద్యాసంవత్సరం నుంచి పదోతరగతిలో ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సంతకం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించి, ప్రభుత్వ పాఠశాలలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చి దిద్దుతామని, బిడ్డను చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు అందించే అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్పారు.
Published on 6/21/2019 4:26:00 PM

సంబంధిత అంశాలు