టెన్త్ అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ ‘రీకౌంటింగ్’ కు జూలై 15 ఆఖరు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి అడ్వాన్‌‌సడ్ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 6న విడుదలయ్యాయి.
Education Newsమొత్తం 50,192 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 26,898 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 50.92 శాతం మంది, బాలికలు 57.9 శాతం మంది పాసయ్యారు. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 96.5 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, హైదరాబాద్ జిల్లాలో అతితక్కువగా 34.08 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే వారు జూలై 7 నుంచి 15 వరకు సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా చెల్లించాలని పాఠశాల విద్య డెరైక్టర్ బి.సుధాకర్ తెలి పారు. సూచించారు. రీవెరిఫికేషన్ కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుడి ద్వారా ధ్రువీకరణ సంతకం చేయించి హాల్‌టికెట్ నకలు, కంప్యూటర్ మెమో కాపీ జతచేసి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూలై 7 నుంచి 15లోగా సమర్పించాలన్నారు. ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ కార్యాలయానికి పోస్ట్, కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తు ఫారాలను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారం నమూనాను www.bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి పొందొ చ్చని తెలిపారు. రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Published on 7/8/2019 3:20:00 PM

సంబంధిత అంశాలు