ఏపీ డీఎస్సీ దరఖాస్తుకు ఈ సర్టిఫికెట్లు పనికిరావు


సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ-2018లో దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ ధ్రువపత్రాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Education Newsఈ మేరకు 24 ఫేక్ యూనివర్సిటీల జాబితాను డీఎస్సీ- 2018 వెబ్‌సైట్లో పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తించిన యూనివర్సిటీల నుంచి పొందిన ధ్రువపత్రాలను మాత్రమే డీఎస్సీకి అనుమతించనున్నారు. యూజీసీ ఫేక్ యూనివర్సిటీలుగా గుర్తించిన సంస్థల ధ్రువపత్రాలతో డీఎస్సీకి అనుమతించరు.

రాష్ట్రాల వారీగా 2018 ఏప్రిల్ నాటికి గుర్తించిన ఫేక్ వర్సిటీలు :
 1. మైథిలీ విశ్వవిద్యాలయం, దర్భాంగా, బిహార్
 2. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, దార్యాగంజ్, ఢిల్లీ
 3. యునెటైడ్ నేషన్స్ యూనివర్శిటీ, ఢిల్లీ
 4. వొకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ.
 5. ఏడీఆర్ సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ, గోపాల టవర్, 25 రాజేంద్ర ప్లేస్, న్యూఢిల్లీ
 6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, న్యూఢిల్లీ
 7. విశ్వకర్మ ఓపెన్ యూనివర్శిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఢిల్లీ
 8. అధ్మాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం), ఢిల్లీ
 9. బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కర్నాటక
 10. సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం, కేరళ
 11. రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, నాగపూర్, మహారాష్ట్ర
 12. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్‌కత్తా
 13. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, తకుర్పుర్కూర్, కోల్‌కత్తా
 14. వారణాసి సంస్కృతం విశ్వవిద్యాలయ్, వారణాసి (యూపీ) జగత్పూరి, ఢిల్లీ
 15. మహిళ గ్రామ విద్యాపీఠ్ / విశ్వవిద్యాలయం (మహిళల విశ్వవిద్యాలయం) ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్.
 16. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్
 17. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలెక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్.
 18. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ), అలీగఢ్, ఉత్తరప్రదేశ్.
 19. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ కోసి కలాన్, మధుర, ఉత్తరప్రదేశ్.
 20. మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విశ్వవాడియాలా, ప్రతాప్‌గఢ్, ఉత్తరప్రదేశ్
 21. ఇంద్రప్రస్థ శిక్షా పరిషద్, ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, ఖోడా, మకాన్పూర్, నోయిడా ఫేజ్ 2, ఉత్తరప్రదేశ్
 22. నవభారత్ శిక్షా పరిషత్, రూర్కెలా, ఒడిశా
 23. నార్త్ ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, ఒడిశా
 24. శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వజితూర్ రోడ్, పుదుచ్చేరి
(బారతీయ శిక్షా పరిషత్ లక్నో కాలేజీ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది కనుక తీర్పుననుసరించి తదుపరి నిర్ణయం ఉంటుంది.)
Published on 11/13/2018 11:41:00 AM
టాగ్లు:
AP DSC- 2018 AP DSC- 2018certificates AP teacher jobs AP teacher jobs recruitment Fake universities University grants commission AP school education department Fake universitieslist United nations university Fake universitiescertificates

Practice Papers

Related Topics