ఏపీ స్పెషల్ డీఎస్సీ మళ్లీ వాయిదా!


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ డీఎస్సీ పరీక్ష మరోసారి వాయిదాపడింది. ఇప్పటికే పలు వాయిదాల అనంతరం జూన్ 19న పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా..
Edu newsతాజాగా మరోసారి వాయిదా పడింది. పరీక్షకు సన్నద్ధమవడానికి మరికొంత సమయం కావాలంటూ.. కొందరు అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు విన్నవించడంతో ఈ మేరకు.. పరీక్ష తేదీని జూన్ 30కి మారుస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మొత్తం 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష కోసం మొత్తం 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Published on 6/19/2019 4:14:00 PM
టాగ్లు:
ap special dsc ap special dsc exam postponed Suresh ap special dscre exam date ap special dscnotification teacher posts

Practice Papers

Related Topics