గత రెండేళ్లుగా ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) 2012-13 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను మార్కెట్లోకి మార్చి 5న విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పంపిణీదారులకు ఈ పుస్తకాలను సరఫరా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్ నుంచి కూడా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. పాఠశాలలు తమను స్వయంగా సంప్రదించి పుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఈ ఏడాది దాదాపు మూడున్నర కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని మండలి అంచనా వేసింది. |