రాష్ట్రంలో 657 డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టుల భర్తీకి మే 6న నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పడనుంది! డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండటంతో కమిషన్ వర్గాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (స్లెట్) నిర్వహించిన తర్వాత డీఎల్ రాతపరీక్షను నిర్వహించే అంశంపై కమిషన్ ఇప్పటికే చర్చలు జరిపింది. |