ఎంసెట్-2012కు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువు మార్చి 30తో ముగిసింది. రాత్రి 9.30 గంటల సమయానికి 3,83,384 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌కు 2,89,412 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 92,971 దరఖాస్తులు వచ్చాయి. రెండు విభాగాలకు 1001 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎన్‌వీ రమణారావు పేర్కొన్నారు. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. |