గ్రూప్-2 పోస్టుల భర్తీలో భాగంగా 607 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూలు మార్చి 30తో పూర్తయ్యాయి. అభ్యర్థులు, రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థుల రిజిస్టర్ నంబర్ల వారీగా మార్కుల జాబితాను కమిషన్ నోటీసు బోర్డులో పెట్టడంతోపాటు వెబ్సైట్లోనూ (
www.apspsc.gov.in) అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గ్రూప్-2 రాతపరీక్షలో కొందరు అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించిన అంశంపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ తుది ఫలితాలను ప్రకటించలేదు. అభ్యర్థుల సమాచారం కోసమే ఈ జాబితాను ప్రకటిస్తున్నామని, ఇది ఎంపిక జాబితా కాదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థుల ఎంపిక, ఫలితాలు కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని వివరించింది. కోర్టు తీర్పు అనంతరం మెరిట్, రిజర్వేషన్ల వారీగా భర్తీ చేయనున్నారు. గ్రూప్-2 ఇంటర్వ్యూల్లో 20707095 రిజిస్టర్ నంబరు అభ్యర్థి అత్యధిక మార్కులు (380) సాధించి టాపర్గా నిలిచారు. రెండోస్థానంలో 377 మార్కులు పొందిన అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. టాప్-7లో అంతా పురుషులే ఉండటం విశేషం.
అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు
రిజిస్టర్నెంబరు మార్కులు కమ్యూనిటీ జోన్
| 20707095 |
380 |
ఓసీ |
3 |
| 21208802 |
377 |
ఓసీ |
4 |
| 22583750 |
377 |
ఓసీ |
6 |
| 21501006 |
377.50 |
బీసీ-డి |
5 |
| 20308307 |
374 |
బీసీ-డి |
1 |
| 21215659 |
369.50 |
ఓసీ |
4 |
| 22007353 |
369.50 |
ఓసీ |
6 |