రాష్ట్రవ్యాప్తంగా 2,677 గ్రామ కార్యదర్శుల పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయాలని ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్తరంజన్ బిస్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూర్తిచేయాలి. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యునిగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి వ్యవహరించాలి’ అని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. |