ఎపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెరిగింది. గత డిసెంబర్లో 525 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా.. జనవరిలో 40, మార్చి 26న 56 అదనపు పోస్టులను కలుపుతూ ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. దీంతో వీటి సంఖ్య 621కి పెరిగింది. ఈ పోస్టుల భర్తీకి జూలై 15న రాతపరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఏప్రిల్ 27 నుంచి మే 27వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. పరీక్ష ఫీజును మాత్రం మే 25లోగా చెల్లించాల్సి ఉంటుంది. |