‘సోషియో, ఎకనమిక్ ఔట్లుక్-2015’ పేర రాష్ట్ర ప్రణాళికా శాఖ సిద్ధం చేసిన ఈ నివేదికలో పలు అంశాలపై వివరాలను వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాలను, మరో నాలుగేళ్లకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికను స్పష్టం చేసింది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)
రాష్ట్ర స్థూల ఆదాయం |
రూ.2,17,432కోట్లు |
జీఎస్డీపీ వృద్ధి అంచనా |
5.3 శాతం |
సేవా రంగం వాటా |
రూ. 1,36,696 కోట్లు (57.1%) |
పారిశ్రామిక రంగం వాటా |
రూ. 52,210 కోట్లు (25%) |
వ్యవసాయ రంగం వాటా |
రూ. 27,926 కోట్లు (17.9%) |
ముఖ్యాంశాలు
- 2013-14లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 95,361 కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,03,889 అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం రూ. 88,533 కంటే ఇది ఎక్కువ.
- మొత్తంగా రాష్ట్ర తలసరి ఆదాయంలో 8.9 శాతం వృద్ధి కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది.
- రాష్ట్రంలో అక్షరాస్యత 66.46 శాతానికి (2011 సెన్సెస్) పెరిగింది. జాతీయ అక్షరాస్యత శాతం (72.99 శాతం) కంటే ఇది తక్కువ.
- పురుషుల అక్షరాస్యత 74.95 శాతం. మహిళల అక్షరాస్యత 57.92 శాతం. దేశంలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది.
- వయోజనుల అక్షరాస్యత 73.7 శాతం కాగా.. 29 శాతం గ్రామీణ కుటుంబాల్లో అసలు వయోజన అక్షరాస్యులు లేరు (జాతీయ స్థాయిలో 18.7శాతం). 6 శాతం పట్టణ కుటుంబాల్లో వయోజన అక్షరాస్యులు లేరు.
- అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్ (83.25%). అతితక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లా మహబూబ్‌నగర్ (55.04%).
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో డ్రాపౌట్స్ పెరిగారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఎస్సీల్లో 40.3 శాతం, ఎస్సీల్లో 62.8 శాతం డ్రాపౌట్లు ఉంటున్నారు.
- పశుపోషణలో రాష్ట్రం దేశంలో 10వ స్థానంలోఉంది. (5.52 శాతం). గొర్రెల పెంపకంలో దేశంలో మొదటి స్థానం, కోళ్ల పెంపకంలో 5వ స్థానం, మేకల పెంపకంలో 12వ స్థానంలో ఉంది.
- రాష్ట్రంలో 29 లక్షల కుటుంబాలు పశుపోషణపై ఆధారపడి ఉన్నాయి. అక్టోబర్ ఆఖరు నాటికి 624.80 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగింది. అక్టోబర్ చివరికి 2.94 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది.
- అక్టోబర్ చివరికి 2,354.32 లక్షల టన్నుల పాల ఉత్పత్తి అయ్యింది. రాష్ట్రంలో రోజువారీ తలసరి పాల లభ్యత 234 గ్రాములు.
- రాష్ట్రంలో రోజు వారీ పాల సేకరణ 2.01లక్షల లీటర్లు కాగా, ఇది గత ఏడాది అక్టోబరులో 1.27 లక్షల లీటర్లుగా ఉంది.
- రాష్ట్రంలో 55.49 శాతం మంది ఆధారపడిన వ్యవసాయంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మైనస్ 10.3 శాతంగా నమోదయింది.
- సేవారంగం వాటాలో 9.7 శాతం, పారిశ్రామిక రంగంలో 4.1 శాతం వృద్ధి కనిపిస్తోంది. మొత్తంగా 5.3 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. ఇది గత ఏడాది (4.8 శాతం) కంటే ఎక్కువ.
- 2010-11 వ్యవసాయ గణాంకాల మేరకు రాష్ట్రంలో 55.54 లక్షల భూ కమతాలు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 61,97 లక్షల హెక్టార్లు. సరాసరి ఒక భూ కమతం విస్తీర్ణం 1.11 హెక్టార్లు మాత్రమే.
- రాష్ట్రంలో 62 శాతం కమతాలు ఒక హెక్టారు కంటే తక్కువ (మార్జినల్) విస్తీర్ణం కలిగినవే. మరో 23.9 శాతం ఒకటి నుంచి రెండు హెక్టార్ల (స్మాల్) విస్తీర్ణంలో ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 60 శాతానికిపైగా చిన్న కమతాలే.
- 2013-14లో 31.64 లక్షల హెక్టార్లకు సాగునీరు అందింది. కాలువల ద్వారా 4.7 లక్షల హెక్టార్లు, చెరువుల ద్వారా 2.83 లక్షల హెక్టార్లు, బావుల ద్వారా 23.36 ల క్షల హెక్టార్లు, ఇతర వనరుల కింద 0.75 లక్షల హెక్టార్లు మొత్తంగా 31.64 లక్షల హెక్టార్లకు సాగునీరు అందింది.
- ఇది 2012-13లో 25.57 లక్షల హెక్టార్లు. అంటే 23.74 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2014-15 ఖరీఫ్‌లో 14.98 లక్షల హెక్టార్లకు సాగునీరు అందింది.
>
భూ వినియోగం .. |
( లక్షల హెక్టార్లలో ..) |
భౌగోళిక విస్తీర్ణం |
114.84 |
నికరసాగు వినియోగం |
49.61 (43.20%) |
అటవీ భూమి |
27.43 (23.89%) |
బంజరు భూమి |
9.60 (8.36%) |
వ్యవసాయేతర వినియోగం |
8.95 (7.79%) |
వ్యవసాయయోగ్యం కానిది |
6.15 (5.36%) |
ఇతర బంజరు |
7.17 (6.2%) |
వృథా (వ్యవసాయ యోగ్యం),
ఇతర వినియోగం |
5.93 (5.2%) |
2013-14లో జిల్లాల వారీగా తలసరి ఆదాయం (రూ.లో)
హైదరాబాద్ |
1,32,862 |
రంగారెడ్డి |
1,17,752 |
మెదక్ |
1,14,006 |
ఖమ్మం |
99581 |
కరీంనగర్ |
90859 |
నల్లగొండ |
84249 |
మహబూబ్‌నగర్ |
78687 |
వరంగల్ |
73496 |
నిజామాబాద్ |
71528 |
ఆదిలాబాద్ |
68511 |
అంకెల్లో రాష్ట్రం..
భౌగోళిక విస్తీర్ణం |
1,14,840 చదరపు కిలోమీటర్లు |
జనాభా |
3,51,93,978 (2011 సెన్సెస్) |
గ్రామీణ జనాభా |
61.33 శాతం |
పట్టణ జనాభా |
38.67 శాతం |
రాష్ట్ర సరాసరి జన సాంద్రత |
306 (ఒక చదరపు కి.మీ) |
అతితక్కువ జన సాంద్రత |
170 (ఆదిలాబాద్) |
ఎక్కువ జన సాంద్రత |
18,172 (హైదరాబాద్) |
స్త్రీ, పురుష నిష్పత్తి |
988 (వెయ్యి మంది పురుషులకు మహిళ లు) |
స్త్రీ, పురుష నిష్పత్తి (0-6 ఏళ్లు) |
933 (వెయ్యి మంది బాలురకు బాలికలు) |
మొత్తం జనాభాలో ఎస్సీలు |
54,32,680 (15.44 శాతం) |
మొత్తం జనాభాలో ఎస్టీలు |
32.87 లక్షలు (9.34శాతం) |
- రాష్ట్రంలో మొత్తం జనాభాలో 38.67శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తోంది. (జాతీయ స్థాయిలో 31.15 శాతం) హైదరాబాద్‌లో నూటికి నూరు శాతంకాగా, రంగారెడ్డి జిల్లాలో 70.32 శాతం పట్టణ జనాభా ఉంది.
- 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83.58 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2015న నిర్వహించిన సర్వేలో కుటుంబాల సంఖ్య 101.83 లక్షలుగా తేలింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా లో 16.56 లక్షలు, తక్కువగా ఖమ్మం జిల్లాలో 8.31లక్షల కుటుంబాలు ఉన్నాయి.
- రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని తెలంగాణ పరిధిలో 3 జోన్లు, 10 రీజియన్ల పరిధిలో 94 డిపోలు ఉన్నాయి. వీటిలో 10,342 బస్సులు ఉండగా.. 58 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నిత్యం 83.15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కో బస్సు సరాసరిన రోజూ 331 కిలోమీటర్లు తిరుగుతోంది.
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2014-15లో దేశీయ ప్రయాణికుల సంఖ్య 20 శాతం, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 13 శాతం పెరిగింది. 77.50 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది.
- హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది జిల్లాల పరిధిలో 195 భారీ పరిశ్రమల ద్వారా 46,257 మంది ఉపాధి పొందుతున్నారు.
- ఈ పరిశ్రమల్లో రూ. 19,494 కోట్ల పెట్టుబడులు పెట్టారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని 73 పరిశ్రమల్లో 22,254 మందికి.. అత్యల్పంగా వరంగల్ జిల్లాలో 10 మందికి ఉపాధి దొరికింది.
తెలంగాణసామాజిక ఆర్థిక సర్వే పుస్తకం పీడీఎఫ్ ప్రతి కోసం క్లిక్ చేయండి |