Advertisement

ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాల పెంపునకు కృషి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్ తదితర సాంకేతిక, వృత్తి విద్యాసంస్థల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడటంతో పాటు వాటిలో ప్రమాణాలు పెరిగి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తామని ఏపీ ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం (అపెక్మా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, దాడి రత్నాకర్ పేర్కొన్నారు.
Edu news అపెక్మా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికై న వారు సెప్టెంబర్ 17నవిజయవాడలోని అపెక్మా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు రాకపోవడం వల్ల కాలేజీల యాజమాన్యాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక కాలేజీలకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను విడుదల చేశారన్నారు. తొలివిడతగా రూ. 430 కోట్లు ఇచ్చారని, మిగతా మొత్తాన్ని త్వరలోనే విడతల వారీగా విడుదల చేస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
Published on 9/18/2019 12:18:00 PM
టాగ్లు:
Engineering Students Engineering Technical Education Employment Courses Apecma President N Ramkumar Reddy
 

Related Topics