దేశంలో 5.28 లక్షల పోలీసు ఉద్యోగాలు ఖాళీ


న్యూఢిల్లీ: ఒకవైపు ఉద్యోగాలు లేక దేశంలో నిరుద్యోగులు నానా బాధలు పడుతుంటే, ప్రభుత్వాలు మాత్రం ఉన్న ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
Education Newsకేంద్ర హోంశాఖ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. దేశంలో 5.28 లక్షల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 1.29 లక్షల ఖాళీలు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు మంజూరైన 23,79,728 పోలీసు ఉద్యోగాల్లో 2018 జనవరి 1 నాటికి 18,51,332 ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌కు 4,14,492 పోస్టుల మంజూరు కాగా 2,85,540 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. బిహార్‌కు మంజూరైన 1,28,286 పోస్టుల్లో 50,291, పశ్చిమ బెంగాల్‌కు మంజూరైన 1,40,904 ఉద్యోగాల్లో 48,981 ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 76,407 పోస్టులకు గానూ 30,345 పోస్టుల్లో నియామకాలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌కు 72,176 పోస్టులు మంజూరు కాగా 17,933 ఖాళీగా ఉన్నాయి. దేశంలో ఒక్క నాగాలాండ్ రాష్ట్రంలోనే మంజూరైన పోస్టుల కంటే ఎక్కువ మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ రాష్ట్రానికి మంజూరు చేసిన 21,292 పోస్టుల కంటే అదనంగా 941 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. నియామక ప్రక్రియలు నత్తనడకన సాగడం, ఉద్యోగుల పదవీ విరమణ, ఆకస్మిక మరణాలు వంటి కారణాల వల్ల అధిక సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నాయని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.
Published on 7/8/2019 3:35:00 PM
టాగ్లు:
Central Home Department Police jobs Police jobs in India police jobs recruitment

Related Topics