సెప్టెంబర్1,8 తేదీల్లో సచివాలయాల ఉద్యోగాల పరీక్షలు

సాక్షి, అమరావతి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త.
Education News అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్‌మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌లో ఉంటుందని పేర్కొన్నారు.

కేటగిరీల వారిగా పరీక్షల తేదీలు:
కేటగిరీ-1
 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5
 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ
 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్
 4. వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ
రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం

కేటగిరీ- 2 (గ్రూప్-ఏ) :
 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2
 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్-2

కేటగిరీ-2 (గ్రూప్-బి) :
 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-2
 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3
రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం

కేటగిరీ-3 :
 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2)
 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్
 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్
 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-6)
 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు
 6. ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్-3)
 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్
  రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం
 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2)
 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2)
 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ
  రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం
 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
  రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం
  పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం
Published on 8/3/2019 11:23:00 AM

సంబంధిత అంశాలు