సచివాలయ ఉద్యోగ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి 1,26,728 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలను సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 8 మధ్య నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ వెల్లడించారు.
Edu newsసెప్టెంబర్‌ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేర్వేరు ఉద్యోగాలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌లు ఆగస్టు 13న ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి రాతపరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేయగా.. 21,69,719 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి మొత్తం 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తుండగా.. 10 రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రాలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఆగస్టు 22 నుంచి హాల్‌ టికెట్లను అన్‌లైన్‌లో ఉంచుతున్నామని, అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఉద్యోగాల వారీగా రాత పరీక్షల షెడ్యూల్‌...

తేదీ

సమయం

పోస్టులు

01–09–2019 ఉదయం 1) పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5..
2) గ్రామ, వార్డు మహిళా పోలీసు..
3) వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ (రూరల్‌)
4) వార్డు ఆడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ
(అన్ని ఉద్యోగాలకు కలిపి ఉమ్మడి పరీక్ష)
01–09–2019 సాయంత్రం 1) విలేజీ సెక్రటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌–6 (డిజిటల్‌ అసిస్టెంట్‌)
03–09–2019 ఉదయం 1) వీఆర్వో..
2) సర్వే అసిస్టెంట్‌ (రెండు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడి పరీక్ష)
03–09–2019 సాయంత్రం 1) ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ
04–09–2019 ఉదయం 1) విలేజీ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌
04–09–2019 సాయంత్రం 1) విలేజీ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
06–09–2019 ఉదయం 1) విలేజీ ఫిషరీస్‌ అసిస్టెంట్‌
06–09–2019 సాయంత్రం 1) గ్రామ పశుసంవర్థక శాఖ సహాయకుడు
07–09–2019 ఉదయం 1) ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌–2..
2) వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ (రెండు ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష)
07–09–2019 సాయంత్రం 1) విలేజీ సెరికల్చర్‌ అసిస్టెంట్‌
08–09–2019 ఉదయం 1) వార్డు ప్లానింగ్‌ మరియు రెగ్యులరైజేషన్‌ సెక్రటరీ
2) వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ (రెండు ఉద్యోగాలకు వేర్వేరు రాత పరీక్షలు)
08–09–2019 సాయంత్రం 1) వార్డు ఎడ్యుకేషన్‌ మరియు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ
2) వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ గ్రేడ్‌–2 (రెండు ఉద్యోగాలకు వేర్వేరు రాత పరీక్షలు)
Published on 8/14/2019 11:39:00 AM

సంబంధిత అంశాలు