సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం కలెక్టర్ల నేతృత్వంలో డీఎస్‌సీ

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం జిల్లాస్థాయి సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ)లను ఏర్పాటు చేస్తూ ఆగస్టు 16న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
Edu newsజిల్లాల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల నియామకాల ప్రక్రియలో రాత పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను డీఎస్‌సీలు పర్యవేక్షిస్తాయి. కమిటీలో 18 మంది జిల్లాస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు వైస్ చైర్మన్లుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్-2, జెడ్పీ సీఈవో, వ్యవసాయ శాఖ జేడీ, పశుసంవర్థక శాఖ జేడీ, ఉద్యానవన శాఖ డీడీ, మత్స్య శాఖ డీడీ, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ ఎస్పీ, డీఎంహెచ్‌వో, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. పంచాయతీరాజ్ కమిషనర్ జిల్లాల డీఎస్‌సీలకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేస్తూ నియామకాల ప్రక్రియను పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published on 8/17/2019 3:42:00 PM

సంబంధిత అంశాలు