
బడ్జెట్ హైలైట్స్..
- ప్రయాణికుల చార్జీలు, సరుకు రవాణా చార్జీలు యథాతథం
- రూ.8.5 లక్షల కోట్లతో ఐదేళ్లలో రైల్వేల ఆధునీకరణ
- 2016-17లో ైరె ల్వేలో 1.21 కోట్ల పెట్టుబడులు
- హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ పేర్లతో కొత్తగా మూడు సూపర్‌ఫాస్ట్ రైళ్లు
- ప్రముఖ పుణ్యతీర్థాలను అనుసంధానిస్తూ ఆస్థా సర్క్యూట్
- సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ పేరుతో సూపర్‌ఫాస్ట్ రైలు
- నీళ్లు, మొబైల్ చార్జింగ్ వసతులతో సాధారణ ప్రయాణికులకు దీన్దయాళ్కోచ్లు
- సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్తుల్లో 50% అదనపు కోటా
- 400 రైల్వే స్టేషన్లలో వైఫై. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి మరో 100 స్టేషన్లలో వైఫై
- వచ్చే ఏడాదికల్లా రైళ్లలో 30,000 బయో టాయ్లెట్ల ఏర్పాటు
- 2020కల్లా డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణికులందరికీ రిజర్వేషన్ సదుపాయం
- ఇ-టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 2,000 నుంచి 7,200కు పెంపు
- ముఖ్యమైన అన్ని రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు
- పాత్రికేయులు రాయితీ టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా పొందే సదుపాయం
- విదేశీ డెబిట్/క్రెడిట్ కార్డులపైనా ఇ-టికెట్లు
- త్వరలో చేతిలో ఇమిడే మిషన్ల ద్వారా రైల్వే టికెట్ల జారీ.
- వికలాంగులు, వృద్ధులకు ‘రైల్ మిత్ర’ ద్వారా సేవలు
- ప్రయాణికులకు ఐచ్చిక ప్రయాణ బీమా
- చిన్న పిల్లలకు ఆహారం అందించేందుకు ‘‘జననీ సేవ’’
- అటోమేటిక్ డోర్లు, బయో వాక్యూమ్ టాయిలెట్లతో స్మార్ట్ బోగీలు
- టికెట్ల జారీ, ఫిర్యాదులు తదితరాలకు మొబైల్ యాప్
- బోగీల్లో జీపీఎస్ ఆధారిత డిజిటల్ సమాచార బోర్డులు
- ప్రయాణికుల చార్జీల్లో రాయితీలకు రూ.30 వేల కోట్లు
- రిజర్వుడు కోటాలో మహిళలకు 33 శాతం వాటా
ముఖ్యమైన ప్రతిపాదనలు - కేటాయింపులు
- 2015-16 సంవత్సరంలో రూ. 1.83 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యం కాగా.. రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ. 15,744 కోట్లు తగ్గింది.
- వచ్చే ఏడాదిలో రూ. 1.84 లక్షల కోట్లు ఆదాయార్జన లక్ష్యమని ప్రకటించారు. ఇది ప్రస్తుత ఏడాది ఆదాయం కంటే పది శాతం ఎక్కువ.
- ఏడో వేతన సంఘం సిఫారసులు అమలులోకి వస్తుండటంతో వచ్చే ఏడాది రైల్వేపై దాదాపు రూ. 32,000 కోట్ల అదనపు భారం పడుతోంది.
- ఢిల్లీ - చెన్నైలను కలుపుతూ ఉత్తర - దక్షిణ కారిడార్, ఖరగ్‌పూర్ - ముంబైలను కలుపుతూ తూర్పు - పడమర కారిడార్, ఖరగ్‌పూర్ - విజయవాడలను కలుపుతూ తూర్పు తీర కారిడార్లను మూడేళ్లలో నిర్మించటం.
- 3 రకాల కొత్త ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు.. హమ్‌సఫర్, తేజాస్, డబుల్ డెక్కర్ ఉదయ్, ఏసీ రిజర్వేషన్ లేని సూపర్‌ఫాస్ట్ రైలు అంత్యోదయ, తీర్థ స్థలాలను కలుపుతూ ‘ఆస్థా’ రైళ్లు ప్రవేశపెట్టడం.
- చెన్నైలో భారతదేశపు తొలి ఆటో హబ్ ఏర్పాటు. ఏడాదిలో రూ. 40 వేల కోట్ల వ్యయంతో రెండు లోకోమోటివ్ ఫ్యాక్టరీల ఏర్పాటు.
- వచ్చే ఏడాది 2,000 కిలోమీటర్ల లైన్ల విద్యుదీకరణ.. 300 రైల్వే స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు. ఈ ఏడాది కల్లా 100 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం అందుబాటులోకి తేవటం.. రానున్న రెండేళ్లలో మరో 400 స్టేషన్లలో ఆ సౌకర్యం ఏర్పాటు.
- మొత్తం మీద రూ. 92,714 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 44 కొత్త ప్రాజెక్టులను కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలు చేయటం వంటి అంశాలు తెరమీదకు వచ్చాయి.
ఈ తరుణంలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రైల్వే బడ్జెట్ సమగ్ర సమాచారం మీ కోసం..
పెట్టుబడి వ్యయం 1.21 లక్షల కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.21 లక్షల కోట్ల ప్రణాళికా వ్యయంతో బడ్జెట్ అంచనాలను రూపొందించారు. గత సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రణాళికా వ్యయం సగటు కన్నా ఇది రెట్టింపు. ప్రస్తుత సంవత్సరం కంటే ఇది 20 శాతం అధికం.
వసూళ్ల అంచనా 1.84 లక్షల కోట్లు
2016-17 ఆర్థిక సంవత్సరంలో రవాణా వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లు ఉంటాయని బడ్జెట్లో అంచనా వేశారు. అందులో ప్రయాణ ఆదాయం 12.4 శాతం మేర పెరుగుతుందన్న అంచనాతో.. రూ. 51,012 కోట్లు, సరకు రావాణా ఆదాయం రూ. 1.17 లక్షల కోట్లు, ఇతరత్రా మార్గాల్లో రూ. 15,775 కోట్ల వసూళ్లుంటాయని అంచనా వేశారు. ప్రయాణ చార్జీల రాయితీ నష్టం రూ. 30,000 కోట్లుగా ఉండగా.. ప్రభుత్వం నుంచి రూ. 40,000 కోట్లు బడ్జెటరీ మద్దతుగా రైల్వేలు పొందనున్నాయి.

రైల్వే అభివృద్ధికి ఏడు లక్ష్యాలు
రైల్వే వ్యవస్థను మరింత సమర్థంగా తయారుచేసేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బడ్జెట్లో ఏడు లక్ష్యాలను ప్రకటించారు. అవి.
మిషన్ రఫ్తార్: సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, వచ్చే ఐదేళ్లలో సూపర్ ఫాస్ట్ మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల సగటు వేగాన్ని గంటకు 25 కి.మీ మేర పెంచడం ఈ మిషన్ లక్ష్యం.
మిషన్ 25 టన్నులు: సరుకు రవాణా సామర్థ్యం పెంచి అధిక ఆదాయం ఆర్జించడం దీని ఉద్దేశం. 2016-17లో 25 టన్నుల యాక్సిల్ లోడ్ వ్యాగన్ల ద్వారా 10-20%, 2019-20 నాటికి 70% సరుకును రవాణా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
మిషన్ 100: సైడ్ ట్రాక్‌లు, సరుకు రవాణా కేంద్రాల సంఖ్య పెంచడం దీని లక్ష్యం. ప్రస్తుతం వివిధ చోట్ల వీటి ఏర్పాటుకు 400 ప్రతిపాదనలు ఉన్నాయి.
మిషన్ జీరో యాక్సిడెంట్: రైలు ప్రమాదాలను పూర్తిగా నివారించడం దీని లక్ష్యం. వచ్చే రెండుమూడేళ్లలో కాపలా లేని క్రాసింగ్‌లు తొలగిస్తారు. రైళ్లు ఢీకొనకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తారు.

మిషన్ పేస్(ప్రొక్యూర్మెంట్ అండ్ కన్జప్షన్ ఎఫిషియెన్సీ): రైల్వే పరికరాల కొనుగోలు, సేవల్లో నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. దీనిద్వారా 2016-17లో రూ.1,500 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మిషన్ బియాండ్ బుక్-కీపింగ్: రైల్వేలో ఖాతాల తనిఖీని పక్కాగా నిర్వహించడం దీని ఉద్దేశం.
మిషన్ కెపాసిటీ యుటిలైజేషన్: 2019 నాటికల్లా సిద్ధం కాబోయే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్‌కతా రవాణా కారిడార్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకొని అధిక ఆదాయం ఆర్జించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
రిజర్వేషన్ ప్రయాణికులకు 3 రైళ్లు
రిజర్వేషన్ ప్రయాణికుల కోసం తాజా బడ్టెట్‌లో హమ్‌సఫర్, తేజస్, ఉదయ్ అనే మూడు రైళ్లను ప్రకటించారు.
హమ్‌సఫర్: పూర్తిగా థర్డ్ ఏసీ సర్వీసు. కోరుకున్న ప్రయాణికులకు భోజన సదుపాయం.
తేజస్: దేశ రైలు ప్రయాణ భవిష్యత్తును చాటిచెప్పేలా గంటకు 130 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కవ వేగంతో ప్రయాణం. రైల్లో వినోదం, స్థానిక రుచులు, వైఫై సేవలు.
ఉదయ్: అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రిపూట నడిచే ఉత్కృష్ట్ డబుల్ డెకర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రీ (ఉదయ్) ఎక్స్‌ప్రెస్. ప్రయాణికుల తరలింపు సామర్థ్యాన్ని 40% వరకు పెంచగల సామర్థ్యం దీనికి ఉంది. టారిఫ్, టారిఫ్యేతర చర్యల ద్వారా హమ్‌సఫర్, తేజస్‌ల ఖర్చును తిరిగి రాబడతారు.
అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం...
సామాన్యుల కోసం దూరప్రాంతాలకు పూర్తిగా అన్రిజర్వ్డ్ బోగీలతో అంత్యోదయ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్. రద్దీ మార్గాల్లో అందుబాటులో సేవలు. ఎక్కువ మంది అన్రిజర్వ్డ్ ప్రయాణికులకు చోటు కల్పించేందుకు వీలుగా దూరప్రాంత రైళ్లలో రెండు నుంచి నాలుగు వరకు దీన్ దయాళ్ బోగీలు. ఈ బోగీల్లో అందుబాటులోకి తాగునీరు, మరిన్ని మొబైల్ చార్జింగ్ పాయింట్లు.
పెట్టుబడులు ఆకర్షించేందుకు ‘‘సూత్ర’’
రైల్వే శాఖలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, విశ్లేషించి నిర్ణయించేందుకు ఆ శాఖ ఓ కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృం దంలోని ఉద్యోగులకు వేతనాలు, స్టార్టప్ కంపెనీల కోసం రైల్వే బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించింది. స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్, అనలిటిక్స్ (సూత్ర) పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. రతన్ టాటా నేతృత్వంలో రైల్వేల పర్యవేక్షణకు ‘కాయకల్ప్’ అనే ఇన్నోవేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో దేశంలోని ప్రఖ్యాత పెట్టుబడిదారులు, జాతీయ రైల్వే అకాడమీ, రైల్వే బోర్డు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
గూగుల్ సహకారంతో 100 స్టేషన్లలో వైఫై
2016లో 100, వచ్చే రెండేళ్లలో 400 రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఇందుకు గాను గూగుల్‌తో కలసి భారత రైల్వే.. వైఫై సదుపాయాన్ని కల్పించడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.
తగ్గిన సరుకు రవాణా ఆదాయం
ఈ ఏడాది రైల్వేకు సరుకు రవాణా చార్జీల ద్వారా అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే ఏకంగా రూ. 15,744 కోట్ల లోటు ఉన్నట్లు పేర్కొన్నారు. 2015-16లో మొత్తంగా అన్ని మార్గాల ద్వారా రూ. 1.83 లక్షల కోట్లు ఆదాయం సమకూరుతుందని ప్రతిపాదించగా.. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కూడా రూ. 1.67 లక్షల కోట్లు మాత్రమే సమకూరుతాయని తాజాగా సవరించారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పరిస్థితుల కారణంగా దేశ ఆర్థికవృద్ధి మందగించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రయాణికుల ద్వారా రూ. 50,175 కోట్లు ఆదాయం వస్తుందని గత బడ్జెట్లో పేర్కొనగా రూ. 45,376 కోట్లు, సరుకు రవాణా ద్వారా రూ. 1.21 లక్షల కోట్లు వస్తాయని పేర్కొనగా.. రూ. 1.11 లక్షల కోట్లు వస్తాయని తాజా అంచనాల్లో వెల్లడించారు. ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలోనూ రూ. 1,300 కోట్లు తగ్గుదల ఉంది.
ఈ ఏడాది రుణ సేకరణ రూ. 20,000 కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో మార్కెట్ నుంచి రూ. 20,000 కోట్లు రుణంగా సేకరించనున్నారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ), రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థల ద్వారా మూలధన వ్యయం కోసం ఈ రుణాలు తీసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత బడ్జెట్లో రూ. 17,655 కోట్లు రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా... సవరించిన అంచనాల ప్రకారం రూ. 11,848 కోట్లు రుణ సేకరణ జరిగింది. ఇంతకు ఏకంగా 69 శాతం అదనంగా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 20 వేల కోట్ల రుణ సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు.
రైల్ డెవలప్మెంట్ అథారిటీ..
సేవలకు న్యాయమైన ధరలను నిర్ణయించటానికి, పోటీని పెంపొందించటానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపడటానికి, సామర్థ్య ప్రమాణాలను నిర్ధారించటానికి రైల్ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పుతారు.
నవారంభ్, నవీనీకరణ్: రైల్వే బోర్డును పునర్వ్యవస్థీకరించటంతోపాటు బోర్డు చైర్మన్‌కు విశేషాధికారాలను కల్పించాలని నిర్ణయం. బోర్డులో దేశవ్యాప్త డెరైక్టరేట్లను ఏర్పాటుచేసి వెనకబడ్డ జోన్లలో లాభాలు తెచ్చే యత్నాలను ప్రోత్సహించటం. రైల్వేల్లో అధికారుల నియామకాలు చేపట్టడంతోపాటు రైల్వేల వ్యాపారం పెరిగేందుకు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించటం.
సశస్తీకరణ్: రైల్వేల్లో దీర్ఘకాల(10 ఏళ్లు), మధ్యమ ప్రణాళికలను నిర్దేశించుకుని వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్‌ను స్థాపించటం. దేశవ్యాప్తంగా రైలు సేవలను మెరుగుపరిచేందుకు నేషనల్ రైల్ ప్లాన్‌ను రూపొందించుకోవటం.
ఏకీకరణ్: రైల్వే శాఖ నిర్వహిస్తున్న అన్ని కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావటం.
శోధ్ ఔర్ వికాస్: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేల అభివృద్ధి కోసం ప్రయోగాలు చేసేందుకు.. వ్యూహాత్మక సాంకేతికత, సమగ్రాభివృద్ధికి ప్రత్యేక రైల్వే వ్యవస్థ (శ్రేష్ఠ)ను ఏర్పాటుచేసుకోవటం ఇందులో భాగం. ప్రస్తుతమున్న ఆర్డీఎస్వో రోజువారీ విషయాలను చూసుకుంటే.. శ్రేష్ఠ దీర్ఘకాలిక అవసరాలపై దృష్టి సారిస్తుంది.
విశ్లేషణ్: వ్యూహాత్మక పెట్టుబడులు, కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు స్పెషల్ యూనిట్ ఫర్ ట్రాన్స్‌పోర్టేషన్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ (సూత్ర)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నవ్చ్రన: సంస్థ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్టార్టప్‌లకోసం రూ. 50 కోట్ల మూలధనాన్ని సమకూర్చటం
నిమిషానికి 7,200 టికెట్లు
రైల్వే టికెటింగ్ వ్యవస్థలో ప్రస్తుతం నిమిషానికి రెండు వేలుగా ఉన్న ఈ-టికెట్ల జారీ సామర్థ్యాన్ని నిమిషానికి 7,200లకు పెంచనున్నారు. దీంతో గతంలో 40 వేలుగా ఉన్న వినియోగదారుల సేవలు 1.2 లక్షలకు పెరుగుతాయని అంచనా.
30,000 బయో టాయ్‌లెట్స్
‘స్వచ్ఛ రైల్ స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2016-17 ఆర్థిక సంవత్సరం చివరికల్లా రైళ్లలో 30,000 బయో టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయనున్నారు. ‘ప్రపంచంలోనే మొట్టమొదటగా దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో బయో వాక్యూమ్ టాయ్‌లెట్‌ను వాడుతున్నారు.
ఇతర వివరాలు
- తయారీ విభాగం నుంచి అవసరమైన చోట్లకు వాహనాలు తరలించేందుకు చెన్నైలో మొట్టమొదటి రైల్ ఆటో హబ్ ఏర్పాటు చేస్తున్నారు.
- రైల్వేలోని ప్రధానమైన ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు డ్రోన్లు, జియో స్పేసియల్ శాటిలైట్ వ్యవస్థను వినియోగించుకోనున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలతో ఓ సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి దీన్ని నేషనల్ రైల్ మ్యూజియంతో అనుసంధానం చేయడం
- కేంద్రం ఆరోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకుని రైల్వే ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులను అనుసంధానం చేయడం వల్ల రైలు ప్రయాణికులకు దారి పొడవునా ఎక్కడైనా అత్యవసర వైద్యసేవలందేలా చొరవ తీసుకుంటారు.
- గ్యాంగ్మెన్లకు రక్షక్ పథకం పేరుతో.. ప్రత్యేక సదుపాయాలు కల్పించటం, ట్రాక్ రక్షణ (పెట్రోలింగ్)లో వీళ్లు వాడే పరికరాల బరువు తగ్గించేందుకు ఏర్పాట్లు.
- ప్రతి ఏడాది వందమంది ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆహ్వానం పలికి 2-6 నెలలపాటు ఇంటర్న్న్షిప్ ఇవ్వాలని నిర్ణయించారు.
- గిర్డర్ బ్రిడ్జెస్లో స్టీల్ స్లీపర్స్‌కు బదులుగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే రీసైకిల్ ప్లాస్టిక్‌తో చేసిన స్లీపర్స్‌ను వినియోగించాలని నిర్ణయం.
- భవిష్యత్తులో 32 స్టేషన్లు, 10 కోచింగ్ డిపోల్లో నీటి రీసైక్లింగ్ డిపోలను ఏర్పాటుచేయటం.
- టికెటింగ్ సమస్యలు, ఫిర్యాదులు-సూచనలకోసం రెండు యాప్‌లను రూపొందించటం.
- కొంకణ్ రైల్వేలో వయోవృద్ధులు, వికలాంగుల కోసం ఉన్న ‘సారథి సేవ’ను బలోపేతం చేయటంతోపాటు రైలు మిత్ర సేవ పేరుతో దేశవ్యాప్తంగా అమలుచేయటం.
- దివ్యాంగుల (వికలాంగులు)కు అన్ని సౌకర్యాలుండేలా స్టేషన్ల ఆధునీకరణ. ఏ1 క్లాసు స్టేషన్లలో దివ్యాంగులను టాయిలెట్ తీసుకెళ్లేందుకు సహాయకుల ఏర్పాటు.
- బుకింగ్ సమయంలోనే ప్రయాణికులకు ప్రయాణ బీమా కల్పించేలా ఏర్పాటు.
- అజ్మీర్, అమృత్సర్, బిహార్ షరీఫ్, చెంగనూర్, ద్వారక, గయ, హరిద్వార్, మథుర, నాగపట్నం, నాందేడ్, నాసిక్, పాలి, పారస్నాథ్, పూరి, తిరుపతి, వైలకన్ని, వారణాసి, వాస్కో వంటి యాత్రాస్థలాలను కలుపుతూ ‘ఆస్థా సర్క్యూట్’ను ప్రారంభించటంతోపాటు.. ఆయా రైల్వే స్టేషన్లను సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
- పోర్టర్లకు కొత్త యూనిఫామ్‌లను సమకూర్చటంతోపాటు వారికి సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పించి సహాయకులుగా పిలవనున్నారు.
- రైళ్లలో వినోదాన్ని అందించేందుకు ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఆహ్వానించటం.
- అన్ని భారతీయ భాషల్లో ‘రైలు బంధు’ను అన్ని రిజర్వ్డ్ క్లాసులకు వర్తింపచేయటం.
ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,823 కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2016-17లో మొత్తంగా రూ.2,823 కోట్ల మేర ప్రాజెక్టుల పనులు కేటాయించారు. యూపీఏ-2 హయాంలో సగటున ఏటా రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో సగటు రూ.2,195 కోట్లుగా ఉంది. కొత్తగా 10 మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులు కేటాయించారు.
కొత్తగా రైల్వే మార్గాల నిర్మాణం
మార్గం |
దూరం |
అంచనా(రూ.కోట్లలో) |
గుంతకల్లు-గుంటూరు (డబ్లింగ్) |
443 |
4,000 |
గద్వాల-మాచర్ల |
184 |
3,500 |
డబ్లింగ్‌కు కేటాయింపులు రూ.కోట్లలో
గుత్తి-ధర్మవరం-బెంగళూరు |
30 |
కల్లూరు-గుంతకల్లు |
60 |
రేణిగుంట-ధర్మవరం-వాడీ బైపాస్ |
75 |
విజయవాడ-కాజీపేట్-బైపాస్ లైన్ |
27 |
గత మూడేళ్లుగా ఇలా..
2014-15 రూ.1,105 కోట్లు
2015-16 రూ.2,659 కోట్లు
2016-17 రూ.2,823 కోట్లు
నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు (రూ. కోట్లలో)
మార్గం |
కేటాయింపు |
నంద్యాల-ఎర్రగుంట్ల |
50 |
మాచర్ల-నల్లగొండ |
0.2 |
గద్వాల-రాయిచూర్ |
5 |
కాకినాడ-పిఠాపురం |
50 |
కోటిపల్లి-నర్సాపూర్ |
200 |
ఓబులవారిపల్లె-కృష్ణపట్నం |
100 |
జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ |
110 |
కడప-బెంగళూరు |
58 |
నడికుడి-శ్రీకాళహస్తి |
180 |
గూడూరు-దుగరాజపట్నం |
5 |
భద్రాచలం-కొవ్వూరు |
15 |
కంభం-ప్రొద్దుటూరు |
1 |
తెలంగాణకు రూ.790 కోట్లు కేటాయింపు
తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా రూ. 790 కోట్లు కేటాయించారు. రెండు కొత్త మార్గాలకు నిధులు కేటాయించడంతోపాటు మూడు కొత్త మార్గాలకు సర్వే పనులను చేపట్టనున్నట్లు రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్-2: ఘట్కేసర్-రాయగిరి (యాదాద్రి) వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించనున్నారు. అంచనా విలువ రూ. 330 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం, పీపీపీ విధానంలో ఉంటుంది.
తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపులు
2014-15లో రూ. 258 కోట్లు
2015-16లో రూ. 755 కోట్లు
2016-17లో రూ. 790 కోట్లు
కొత్త మార్గాలకు సర్వే
మార్గం |
దూరం |
అంచనా |
మహబూబ్‌నగర్-డోన్ (డబ్లింగ్) |
175 కి.మీ. |
68 లక్షలు |
బోధన్-లాతూర్ రోడ్ |
130 కి.మీ. |
20 లక్షలు |
నల్లపాడు-బీబీనగర్ (డబ్లింగ్) |
243 కి.మీ. |
36 లక్షలు |
కొత్త రైల్వే మార్గాల నిర్మాణం
మార్గం |
దూరం |
అంచనా (రూ.కోట్లలో) |
గడ్చిందూరు-ఆదిలాబాద్ |
70 కి.మీ. |
1,500 |
సికింద్రాబాద్-జహీరాబాద్ |
70 కి.మీ. |
1,400 |
బోధన్-బీదర్ |
100 కి.మీ. |
2,000 |
గద్వాల-మాచర్ల |
184 కి.మీ. |
3,500 |
రైల్వే ఓవర్ బ్రిడ్జిలు |
|
5 |
రైల్వే అండర్ బ్రిడ్జిలు/సబ్‌వేలు |
10 |
|
నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు
మార్గం |
నిధులు(రూ.కోట్లలో) |
పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ |
70 |
మునీరాబాద్-మహబూబ్‌నగర్ |
90 |
మాచర్ల-నల్లగొండ |
0.2 |
గద్వాల-రాయచూర్ |
5 |
మనోహరాబాద్-కొత్తపల్లి |
30 |
విష్ణుపురం-జాన్‌పహాడ్ |
5 |
జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ |
110 |
భద్రాచలంరోడ్-సత్తుపల్లి |
25 |
భద్రాచలం-కొవ్వూరు |
15 |
అక్కన్నపేట్-మెదక్ |
5 |
కొండపల్లి-కొత్తగూడెం |
0.1 |
మణుగూరు-రామగుండం |
0.1 |
సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ (డబ్లింగ్) |
50 |
సుదీర్ఘ దూరం నడిచే రైళ్లు
మాస్కో-వ్లాదివోస్టాక్(రష్యా)
దూరం: 9,259 కి.మీ.
ప్రయాణం: 178 గంటలు
మాస్కో- బీజింగ్ (వయా హార్బిన్)
దూరం: 8,984 కి.మీ.
ప్రయాణం: 144గంటలు
మాస్కో-బీజింగ్ (వయా ఉలాన్ బాటర్)
దూరం: 7,286 కి.మీ.
ప్రయాణం: 131గంటలు
గ్వాంగ్జో-లాసా
దూరం: 4,980 కి.మీ.
ప్రయాణం: 54.5గంటలు
టొరంటో-వాంకోవర్
దూరం: 4,466 కి.మీ.
ప్రయాణం: 86గంటలు
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైళ్లు
430 కి.మీ: షాంఘై మగ్లేవ్- చైనా
లోంగ్యాంగ్లోని మెట్రోలైన్ స్టేషన్ నుంచి షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మధ్య ఏప్రిల్ 2004 నుంచి ఈ రైలు దూసుకెళ్తుంది.
380 కి.మీ: హార్మోనీ సీఆర్‌హెచ్- చైనా
ఈ సూపర్‌ఫాస్ట్ రైలు బీజింగ్-షాంఘై మధ్య 2010 అక్టోబర్‌లో పట్టాలెక్కింది. చైనాలోనే వుహాన్-గ్వాంగ్జో మధ్య కూడా ఈ రకానికి చెందిన రైలు నడుస్తుంది.
360 కి.మీ: ఏజీవీ ఇటాలో- ఇటలీ
యూరోప్‌లో అత్యంత అధునాతనమైన రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఇటలీలోని నపోలీ-రోమా- ఫిరెంజ్- బొలాగ్నా- మిలాన్ కారిడార్ మధ్య నడుస్తోంది. 2012 నుంచి ఇది సేవలు అందిస్తోంది.
350 కి.మీ: సీమెన్స్ వెలారో ఇ-స్పెయిన్
ఇది స్పెయిన్‌లోని బార్సిలోనా-మాడ్రిడ్ మధ్య 2007 నుంచి ఈ రైలు పరుగులు తీస్తోంది.
ఇప్పటికీ అదే ట్రాక్ రికార్డ్!
1869లో చైనాలో సెంట్రల్ పసిఫిక్ రైల్వే పనుల్లో భాగంగా చైనా, ఐర్లాండ్‌కు చెందిన కార్మికులు ఒక్కరోజులోనే ఏకంగా 10 మైళ్ల ట్రాక్ నిర్మించారు. నేడు ఇంత టెక్నాలజీ ఉన్నా ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరూ అధిగమించలేదట!