English Version

అంగారకుడిపైకి ‘ఇన్‌సైట్’ను ప్రయోగించిన నాసా

అంగారక గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఇన్‌సైట్’ అనే అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
Current Affairsకాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అట్లాస్ వీ రాకెట్ సహాయంతో ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్పోర్ట్ (ఇన్‌సైట్) ను మే 5న అరుణ గ్రహంపైకి పంపింది. 2018 నవంబర్ 26 నాటికి అంగారకునిపై దిగనున్న ఇన్‌సైట్ 10 నుంచి 16 అడుగుల లోతుకు తవ్వి గ్రహం అంతర్భాగ పరిస్థితులను విశ్లేషిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం నాసా సుమారు 99.3 కోట్ల డాలర్లు (రూ.6,635 కోట్లు) ఖర్చు చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంగారక గ్రహంపైకి ఇన్‌సైట్
ఎప్పుడు : మే 5
ఎవరు : నాసా
ఎందుకు : అంగారక గ్రహాంతర్భాగాలను అధ్యయనం చేసేందుకు
Published on 5/7/2018 5:23:00 PM

సంబంధిత అంశాలు