English Version

రైతు బంధు పథకం ప్రారంభం

రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు చేపట్టిన రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
Current Affairsమే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లిలోని ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభలో దర్మరాజుపల్లె గ్రామానికి చెందిన 10 మంది రైతులకు పాస్‌బుక్కులు, పెట్టుబడి సాయం చెక్కులను అందజేశారు. రైతు బంధు ద్వారా 1.43 కోట్ల ఎకరాలకు చెందిన 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) గ్రామాల వారీగా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. మొత్తం 57.33 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హరితహారం కార్యక్రమం, రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కూడా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రైతు బంధు పథకం ప్రారంభం
ఎప్పుడు : మే 10
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : శాలపల్లి, హుజూరాబాద్, కరీంనగర్
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు
Published on 5/10/2018 5:49:00 PM

సంబంధిత అంశాలు