English Version

అత్యంత పరిశుభ్ర మైన నగరంగా ఇండోర్

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది.
Current Affairsఇండోర్ తర్వాత భోపాల్, చండీగఢ్‌లు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు 4,203 నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షన్-2018’ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం మే 16న ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 23 నగరాలకు ఈ పురస్కారాలను ప్రకటించారు.

పరిశుభ్రత పాటించే రాష్ట్రాల్లో జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ రాజధాని నగరం కేటగిరీలో హైదరాబాద్‌కు తొలి స్థానం దక్కగా ఇదే కేటగిరీలో లక్ష నుంచి మూడు లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో తిరుపతి ఉత్తమ నగరంగా నిలిచింది. పది లక్షలు అంతకంటే ఎక్కువ జనాభాగల నగరాల విభాగంలో ఉత్తమ పరిశుభ్రత కలిగిన ‘పెద్ద నగరంగా’ విజయవాడ నిలిచింది.

దక్షిణ జోన్ పరిధిలో లక్ష కంటే తక్కువ జనాభా కలిగిన నగరాల్లో అత్యంత పరిశుభ్ర నగరంగా సిద్దిపేట, పౌరుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం అత్యుత్తుమ సిటీగా బోడుప్పల్, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాల అమల్లో ఉత్తమ నగరంగా పీర్జాదిగూడలు ఎంపికయ్యాయి. గత ఏడాది 430 నగరాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇండోర్‌కే మొదటి స్థానం దక్కింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో అత్యంత పరిశుభ్ర నగరం
ఎప్పుడు : మే 16
ఎవరు : ఇండోర్, మధ్యప్రదేశ్
Published on 5/17/2018 5:12:00 PM

సంబంధిత అంశాలు