ఏపీపీఎస్సీ గ్రూప్-2 తెలుగు సిలబస్ (రివైజ్డ్)

స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమ్స్)

మార్కులు: 150

ఎ) కరెంట్ అఫైర్స్: రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, పరిపాలన, సాంస్కృతిక, కళా రంగాల్లో జాతీయం మరియు అంతర్జాతీయంగా ప్రాధాన్యం కలిగిన అంశాలు.
బి) భారత రాజ్యాంగం: సమాఖ్య వ్యవస్థ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు/ ఆదేశిక సూత్రాలు, కేంద్రం, రాష్ట్రాల్లో శాసన వ్యవస్థలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పాలన, శాసన సంబంధాలు, గిరిజన ప్రాంతాల్లో పాలన.
సి) భారత ఆర్థికాభివృద్ధి: మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ, స్వాతంత్య్రం తర్వాత భారత ప్రణాళికలు, ఆర్థిక, పారిశ్రామిక విధానాలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలు, దేశంలో వ్యవసాయం, హరిత విప్లవం పాత్ర, వివిధ ప్రాంతాలు, వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు.

మెయిన్స్

పేపర్-1 జనరల్ స్టడీస్

మార్కులు: 150

 1. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
 2. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు
 3. సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి
 4. భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
 5. భారత రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు
 6. స్వాతంత్య్రం తర్వాత భారత ఆర్థిక అభివృద్ధి
 7. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యతనిస్తూ భారత భౌగోళిక స్వరూపం
 8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్‌తో విపత్తుల అంచనా
 9. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ
 10. తార్కిక విశ్లేషణా సామర్థ్యం, దత్తాంశ విశదీకరణ
 11. దత్తాంశ విశ్లేషణ
  ఎ. ట్యాబులేషన్ ఆఫ్ డేటా
  బి. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా
  సి. ప్రాథమిక డేటా విశ్లేషణ మరియు విశదీకరణ
 12. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
  ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
  బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
  సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
  డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
  ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
  ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
  జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
  హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
  ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు

పేపర్-2

మార్కులు: 150

విభాగం-I: ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
 1. ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర: ఆంధ్ర భౌగోళిక పరిస్థితులు - చరిత్ర, సంస్కృతిపై వాటి ప్రభావం పూర్వ చరిత్ర - శాతవాహనులు, ఇక్ష్వాకులు - సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం, కళలు వాస్తు శిల్పం తూర్పు/వేంగిచాళుక్యులు -సామాజిక, మత పరిస్థితులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం
 2. కీ.శ. 11 - 16 శతాబ్దాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన రాజ వంశాలు - సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు శిల్పం మరియు చిత్రలేఖనం అభివృద్ధి
 3. యూరోపియన్‌ల రాక: వ్యాపార కేంద్రాలు, ఈస్టిండియా కంపెనీ పాలనలో ఆంధ్ర, 1857 తిరుగుబాటు - ఆంధ్రాపై దాని ప్రభావం, బ్రిటిషు పాలన స్థాపన - సామాజిక, సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ / ఆత్మగౌరవ ఉద్యమాలు, 1885 - 1947 మధ్య ఆంధ్రలో జాతీయవాద ఉద్యమ వ్యాప్తి /విస్తరణ- సామ్యవాదులు, కమ్యూనిస్టులు, జమిందారీ వ్యతిరేక మరియు రైతు ఉద్యమాలపాత్ర, జాతీయవాద కవిత్వం అభివృద్ధి.
 4. ఆంధ్రోద్యమ పుట్టుక, అభివృద్ధి - ఆంధ్ర మహాసభల పాత్ర - ప్రముఖ నాయకులు - 1953లో ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన ముఖ్య సంఘటనలు. ఆంధ్రోద్యమంలో వార్తా పత్రికల పాత్ర.
 5. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన సంఘటనలు - విశాలాంధ్ర మహాసభ - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమీషన్ దాని సిఫార్సులు - పెద్దమనుషుల ఒప్పందం- 1956 - 2014 మధ్య ప్రధాన సాంఘిక, సాంస్కృతిక సంఘటనలు.

విభాగం-II: భారత రాజ్యాంగ విహంగ వీక్షణం
 1. భారత రాజ్యాంగ స్వరూపం-రాజ్యాంగ అభివృద్ధి - రాజ్యాంగం ప్రత్యేక లక్షణాలు - ప్రవేశిక- పాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు వాటి మధ్య సంబంధం - ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు - ఏకకేంద్ర మరియు సమాఖ్య లక్షణాలు.
 2. భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు - శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు - శాసన సభల రకాలు - ఏక శాసనసభ - ద్వి శాసనసభ - కార్యనిర్వహక - పార్లమెంటరీ తరహా శాసనసభలు, న్యాయ నిర్వహణ - న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
 3. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల పంపిణీ - కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన మరియు ఆర్థిక పరమైన సంబంధాలు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాగ్, ఫైనాన్స్ కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు.
 4. కేంద్ర రాష్ట్ర సంబంధాలు - సంస్కరణల ఆవశ్యకత - రాజ్‌మన్నార్ కమిటీ, సర్కారియా కమీషన్, ఎంఎం పూంచీ కమిషన్ - భారత రాజ్యాంగం యొక్క ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాలు.
 5. రాజ్యాంగ సవరణ విధానం - కేంద్రీకరణ - వికేంద్రీకరణ - సామాజిక అభివృద్ధి పథకాలు - బల్వంత్‌రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు - 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టాలు, వాటి అమలు.
 6. భారత్‌లో రాజకీయ పార్టీలు - జాతీయ, ప్రాంతీయ పార్టీలు - ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళపార్టీ వ్యవస్థలు - ప్రాంతీయవాదం - ఉప ప్రాంతీయవాదం - కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ - శ్రీ కృష్ణ కమిటీ - భారత ఐక్యతకు పొంచి ఉన్న ముప్పు.
 7. భారత్‌లో సంక్షేమ యంత్రాంగం - ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకు కల్పించిన సదుపాయాలు, - ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల రిజర్వేషన్లు - ఎస్సీ, ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం - జాతీయ, రాష్ట్రీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా కమీషన్ - జాతీయ, రాష్ట్రీయ మైనారిటీ కమీషన్స్ - మానవ హక్కుల కమీషన్ - సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్ మరియు లోకాయుక్త.

పేపర్-3

మార్కులు: 150

విభాగం-I: భారత ప్రణాళికా వ్యవస్థ మరియు భారత ఆర్థిక వ్యవస్థ
 1. భారత్‌లో ప్రణాళికలు, ప్రస్తుత స్థితి: పంచవర్ష ప్రణాళికల సామాజిక, ఆర్థిక లక్ష్యాలు మరియు కేటాయింపులు - ప్రత్యామ్నాయ వ్యూహాలు - లక్ష్యాలు మరియు విజయాలు - వివిధ ప్రణాళికల వైఫల్యానికి గల కారణాలు - 1991 నూతన ఆర్థిక సంస్కరణలు - ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణ - క్రమబద్దీకరణ సంస్థల ఏర్పాటు, నీతి ఆయోగ్, సహకార సమాఖ్య పద్ధతి, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ.
 2. భారత ఆర్థిక విధానాలు - వ్యవసాయ విధానాలు - 1956 నుంచి పారిశ్రామిక విధానాలు - ఐటీ పరిశ్రమలు - ఆర్‌బీఐ ద్రవ్య విధానం - కోశ విధానం - లక్ష్యాలు, ద్రవ్య అసమతుల్యత మరియు ద్రవ్యలోటు - నూతన విదేశీ వాణిజ్య విధానం. కరెంట్ అకౌంట్ అసమానతలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.
 3. సహజ వనరుల లభ్యత మరియు అభివృద్ధి: జనాభా-పరిమాణం, వృద్ధి ధోరణులు, వృత్తుల వారీ శ్రామిక విభజన, అభివృద్ధి కొలమానంగా హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్, జనాభా రూపు రేఖలు
 4. ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వవిత్తం: ద్రవ్య భావన, ద్రవ్య సరఫరా కొలమానాలు - వాణిజ్య బ్యాంకుల ద్వారా పరపతి సృష్టి, ధరలస్థాయి నిర్ధారణ, ద్రవ్యోల్బణం-కారణాలు, నివారణలు, బడ్జెట్ - పన్ను మరియు పన్నేతర ఆదాయం, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)
 5. వృద్ధి వివరణ మరియు మాపనాలు: వృద్ధి మరియు అభివృద్ధి మధ్య వ్యత్యాసం, వృద్ధి మాపనం - వృద్ధి, అభివృద్ధి మరియు అల్పాభివృద్ధి - అల్పాభివృద్ధి లక్షణాలు - అభివృద్ధి దశలు - మూలధన సమీకరణ వనరులు, వృద్ధి వ్యూహాలు - నియంత్రణల సడలింపు మరియు వృద్ధి.
 6. జాతీయాదాయం: జాతీయాదాయ భావనలు, స్థూల దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయం.

విభాగం-II: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
 1. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం, ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం తోడ్పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, భూ సంస్కరణల ఆవశ్యకత, అటవీ, సాగుభూమి విస్తీర్ణం, పంటల విధానం, వ్యవసాయ పరపతి వనరులు, వ్యవసాయ సబ్సిడీలు, ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ.
 2. ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలు - కేటాయింపులు - ప్రభుత్వ రంగ ప్రణాళికలకు ఆర్థిక సహాయం - ఆంధ్రప్రదేశ్ పంచవర్ష ప్రణాళికలకు వనరుల కేటాయింపు, నీతి ఆయోగ్ ఏర్పాటు తర్వాతి పరిణామాలు.
 3. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక విధానాలు-అమలు, ఏపీలోని పరిశ్రమలు - పరిశ్రమల వృద్ధి, స్వరూపం - చిన్నతరహా మరియు కుటీర పరిశ్రమల పాత్ర - సహకార సంఘాల నిర్మాణం - ఆంధ్రప్రదేశ్ మొత్తం పరపతిలో సహకార సంఘాల వాటా, ఎనర్జీ మేనేజ్‌మెంట్
 4. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం - ప్రాముఖ్యత - రవాణా, విద్యుత్, సమాచారం, పర్యాటకం, సమాచార సాంకేతికతలకు ప్రాధాన్యతనిస్తూ సేవారంగం కూర్పు మరియు అభివృద్ధి.
 5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలు.
Tags:
APPSC Group II Telugu revised Syllabus revised Telugu Syllabus for APPSC Groups Group II Services Telugu Syllabus revised Telugu Syllabus for Group II APPSC Group II APPSC Group II Syllabus in Telugu Medium APPSC New Syllabus in Telugu Telugu Medium Syllabus for Groups Telugu Medium revised Syllabus for Group II Groups Telugu Medium New Syllabus
Published on 8/9/2016 12:43:00 PM

Related Topics