ఏపీపీఎస్సీ గ్రూప్-4 తెలుగు సిలబస్

Career Guidanceగ్రూప్-4
పేపర్-1: జనరల్ స్టడీస్ (పదోతరగతి స్థాయి)
 1. చరిత్ర, అర్థ శాస్త్రం, పౌరశాస్త్రం మరియు భూగోళ శాస్త్రం
 2. భౌతిక శాస్త్రం
 3. సామాన్య శాస్త్రం
 4. వర్తమాన వ్యవహారాలు
 5. తార్కిక మరియు విశ్లేషణా సామర్థ్యం(Reasoning and Analytical Ability)
 6. విపత్తు నిర్వహణ ప్రాథమిక భావనలు (సీబీఎస్‌ఈ 8, 9వ తరగతి స్థాయి)
 7. ఆంధ్రప్రదేశ్ విభజన
 8. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిర క్షణ
 9. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
  ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
  బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
  సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
  డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
  ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
  ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
  జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
  హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
  ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 అందులోని అహేతుక అంశాలు

సబ్జెక్టులవారీగా సిలబస్
అర్థ శాస్త్రం
 • ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాబివృద్ధి - ఆర్థికాభివృద్ధి సూచికలు, భారత్‌దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ లక్షణాలు.
 • జాతీయాదాయం - జాతీయాదాయం భావనలు - స్థూల జాతీయ ఉత్పత్తి - నికర జాతీయ ఉత్పత్తి - తలసరి ఆదాయం - వ్యయార్హ ఆదాయం - జాతీయదాయం అంచనా - జాతీయాదాయం ధోరణులు - భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు - రంగాల వారీగా జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) పంపిణీ.
 • భారతదేశంలో ప్రణాళికలు మరియు ఆర్థిక సంస్కరణలు - ప్రణాళికల అర్థం - లక్ష్యాలు - భారత పంచవర్ష ప్రణాళికలు - నీతి ఆయోగ్ -12వ పంచవర్ష ప్రణాళిక - పేదరిక నిర్మూలన మరియు నిరుద్యోగితనుతగ్గించే కార్యక్రమాలు.
 • పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి - పర్యావరణ భావనలు - పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు - పర్యావరణ కాలుష్యం - రకాలు - కాలుష్య నియంత్రణం చర్యలు - సుస్థిర ఆర్థికాభివృద్ధి.
 • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చరిత్ర - స్వభావ లక్షణాలు - జనాభా రూపురేఖలు - వృత్తి పరమైన శ్రామిక విభజన - వ్యవసాయం, పారిశ్రామిక మరియు సేవా రంగాల అభివృద్ధి - సంక్షేమ మాపనాలు.

జీవశాస్త్రం
జీవ ప్రపంచం - పరిచయం, ప్రోకారియోటిక్ మరియు యూకారియోటిక్ కణాలు, బ్యాక్టీరియా నిర్మాణం, ప్రత్యుత్పత్తి మరియు ఉపయోగాలు. వైరస్‌ల స్వభావం, వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, వృక్ష సామ్రాజ్యం మరియు జంతు సామ్రాజ్యం - శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, అకశేరుకాలు మరియు సకశేరుకాల ముఖ్య లక్షణాలు, ఆహారం, నార మరియు ఔషధాల్లో మొక్కల ఉపయోగాలు, పంట మొక్కలు, ఆహారం మరియు ఔషధాల్లో జంతువుల ఉపయోగాలు.

భౌతిక శాస్త్రం
పదార్థం, యాంత్రిక శాస్త్రం, ధ్వని, ఉష్ణం, కాంతి, విద్యుత్తు, విద్యుదయాస్కాంత త్వం, నిజ జీవితంలో విద్యుదయాస్కాంత అనువర్తనాలు, రసాయన సమీకరణాలు మరియు చర్యలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, కర్భనం దాని సమ్మేళనాలు, లోహసంగ్రహణ శాస్త్రం.

చరిత్ర
భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర. 1956 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ముఖ్యమైన సాంస్కృతిక సంఘటనలు - 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు.

పేపర్-2 : సెక్రటేరియల్ ఎబిలిటీస్
 1. మానసిక సామర్థ్య పరీక్ష (మెంటల్ ఎబిలిటీ - వర్బల్ అండ్ నాన్‌వర్బల్)
 2. తార్కిక విశ్లేషణ(లాజికల్ రీజనింగ్)
 3. కాంప్రహెన్షన్
  వ్యాసరూప (డిస్క్రిప్టివ్) ప్యాసేజ్
  తార్కిక (లాజికల్) ప్యాసేజ్
  వర్ణణాత్మక (నెరేటివ్) ప్యాసేజ్
 4. ఎ) వాక్యాల పునరమరిక (ప్యాసేజ్ మెరుగుదల దృష్టితో)
  బి) అక్షర దోషాలు, విరామ చిహ్నాలు, ప్రూఫ్ రీడింగ్ మరియు ఎడిటింగ్
 5. న్యూమరికల్ మరియు అరిథ్‌మెటికల్ ఎబిలిటీస్.
Tags:
APPSC Group 4Telugu Syllabus Telugu Syllabus for APPSC Groups Group 4 Services Telugu Syllabus Telugu Syllabus for Group 4 APPSC Group 4 APPSC Group 4 Syllabus in Telugu Medium APPSC New Syllabus in Telugu Telugu Medium Syllabus for Groups Telugu Medium Syllabus for Group 4 Groups Telugu Medium New Syllabus
Published on 8/11/2016 11:55:00 AM

Related Topics