గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2 కేటగిరీ పోస్టులు సహా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,386 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిసెంబర్‌ 31న ఏడు వేరువేరు నోటిఫికేషన్లు జారీచేసింది.
Jobs Images ఇందులో గ్రూప్‌–1లో 169, గ్రూప్‌–2లో 446, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు 308, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు 405, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు 43, అసిస్టెంట్‌ ఫిషరీస్‌ ఇన్‌స్పెక్టర్లు 10, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్లు 5 పోస్టులకు ఈ నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ పరీక్ష ఫీజు, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు వేర్వేరు తేదీలను కమిషన్‌ ఆయా నోటిఫికేషన్లలో పొందుపరిచింది. స్క్రీనింగ్‌ టెస్టు, మెయిన్స్‌ తేదీలకు సంబంధించిన సమాచారాన్ని, నిబంధనలను కమిషన్‌ వెబ్‌సైట్లో ఉంచింది. ప్రభుత్వం అనుమతించిన కొత్త ఖాళీలతోపాటు గతంలో భర్తీకాకుండా మిగిలున్న పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లలో వేర్వేరుగా చూపించారు. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోలో పేర్కొన్న కొన్ని కేటగిరీల పోస్టులు నోటిఫికేషన్లలో పెరగ్గా మరికొన్ని పోస్టులు తగ్గాయి. కీలకమైన గ్రూప్‌–1 పోస్టులు జీవోలో 182 ఉండగా నోటిఫికేషన్లో 169 మాత్రమే చూపించారు. గ్రూప్‌–2లో జీవోలో 337 పోస్టులను చూపించగా గతంలో మిగిలిన వాటిని కలుపుకుని 446 పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 154, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 292 ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా కేటగిరీల్లో దరఖాస్తు చేసే అభ్యర్థుల సంఖ్య 25 వేలు దాటితే స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు తేదీల్ని కమిషన్‌ వెబ్‌సైట్లో పెట్టింది. అలాగే ఈ ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆన్‌లైన్లో ఫీజు చెల్లించడానికి ఆయా దరఖాస్తుల చివరి గడువుకు ముందు తేదీల్లో అర్థరాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది.
ఆయా పోస్టులకు దరఖాస్తు తేదీలు ఇలా...
పోస్టు కేటగిరీ దరఖాస్తు గడువు
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 27
ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు జనవరి 17 నుంచి ఫిబ్రవరి 8
గ్రూప్‌–2 సర్వీసు జనవరి 10 నుంచి జనవరి 31
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 26
గ్రూప్‌–1 సర్వీసు జనవరి 7 నుంచి జనవరి 28
అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 8
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12
 
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ....
గ్రూప్‌–1 స్క్రీనింగ్‌ టెస్ట్‌ :
2019 మార్చి 10 .
గ్రూప్‌–1 మెయిన్స్‌ : 2019 జూన్‌ 10 నుంచి 22 వరకు.
గ్రూప్‌–2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ : 2019 మే 5 .
గ్రూప్‌–2 మెయిన్స్‌ : 2019 జులై 18, 19.
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు: స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తర్వాత తెలియచేస్తారు..
మెయిన్స్‌ జూలైలో..
డిగ్రీ కాలేజి లెక్చరర్లు: స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తర్వాత తెలియచేస్తారు.
. మెయిన్స్‌ 2019 మే 21, 22 తేదీల్లో .
ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తర్వాత తెలియచేస్తారు..
మెయిన్స్‌ మే 21, 22 తేదీల్లో .
అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తర్వాత తెలియచేస్తారు..
మెయిన్స్‌ 2019 మే 27న..
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌: స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తర్వాత తెలియచేస్తారు..
మెయిన్స్‌ పరీక్షలు 2019 ఏప్రిల్‌ 25న జరుగుతాయి.

గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి .
గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి .
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి .
పాలిటెక్నిక్‌ లెక్చరర్లు నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి
Tags:
APPSC Groups notifications APPSC Group1 notification APPSC Group2 notification Andhra pradesh public service commission Degree lecturers jobs notification Polytechnic lecturer jobs notification APPSC Groups application APPSC Groups apply last date
Published on 1/1/2019 12:34:00 PM

Related Topics