Advertisement

ఇంటెలిజెన్స్ కొలువు.. ఇలా సులువు


Bavithaసరిహద్దుల్లో రక్షణ కవచాలు సైనికులైతే, దేశం లోపల అంతర్గత భద్రతకు పొంచి ఉన్న ముప్పును పసిగట్టేవారు ఇంటెలిజెన్స్ అధికారులు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఇతర సాంఘిక వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచి వాటిని నియంత్రించడంలో వీరి కృషి ఎనలేనిది. నిరంతరం శాంతి భద్రతలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వాన్ని, అప్రమత్తం చేస్తారు. ఇంతటి బాధ్యతాయుత ఉద్యోగంలో ప్రవేశించాలంటే అపరిమిత నాలెడ్జ్, సామాజిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. వీటికి తోడు పరిసరాలను పసిగట్టగలిగే తెలివి తేటలు, కోవర్టు ఆపరేషన్లు నిర్వహించగలిగే ధైర్యసహాసాలు తప్పనిసరి. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ దేశవ్యాప్తంగా 750 అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తరుణంలో పరీక్ష ప్రణాళికపై విశ్లేషణ...

దేశ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం 25 వేల మంది నిఘా అధికారులు అవసరం కాగా కేవలం 3 వేల మంది మాత్రమే పని చేస్తున్నారు.
ఐబీ గురించి.. ఈ సంస్థ 1887లో బ్రిటిష్ కాలంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఫర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా ఏర్పడింది. దీనిని 1947లో హోం మంత్రిత్వ శాఖ కింద సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా మార్చారు. భద్రతాపరమైన అంశాలకు సంబంధించి దేశం వెలుపల, లోపల సమాచారాన్ని సేకరించడం దీని ప్రధాన విధి. కానీ ప్రస్తుతం అంతర్గతంగా పొంచి ఉన్న సాంఘిక వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను మాత్రమే పసిగడుతోంది. కారణం 1968లో ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ కార్యకాలపాల కోసం రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (RAW) ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

విధులు: పోలీసు శాఖలోసబ్‌ఇన్‌స్పెక్టర్ తో సమానంగా ఉండే అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ అధికారులు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా పనిచేయాల్సి ఉంటుంది. వివిధ కుంభకోణాలు, అంతర్గత భద్రతా పరిస్థితుల అంచనా, ఉగ్రవాదం ముప్పు వంటి వాటిపై నిరంతరం అధ్యయనం చేస్తూ సమాచారాన్ని సేకరించాలి. సున్నితమైన సమాచారాన్ని సేకరించే సమయంలో రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతాయి. అన్నింటిని తట్టుకొని విధులు నిర్వహించే ఆత్మస్థైర్యం ఉండాలి.

వేతనం: ప్రారంభ వేతనం అన్ని అలవెన్సులు కలుపుకొని 20 వేల దాకా వస్తుంది. తర్వాత ప్రభుత్వం అందించే అన్నిరకాల లోన్ సదుపాయాలు పొందవచ్చు.ఏసీఐవో గ్రేడు II లో ప్రవేశించినవారు పని సామర్థ్యాన్ని బట్టి అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడు I, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, జాయింట్ డిప్యూటీ డెరైక్టర్, అడిషనల్ డిప్యూటీ డెరైక్టర్, డిప్యూటీ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్, అడిషనల్ డెరెక్టర్, డెరైక్టర్ వంటి పదోన్నతులు పొందవచ్చు.

పోస్టులు: అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడు II
ఖాళీలు: 750
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత.
కంప్యూటర్ నాలెడ్జ్‌లో డిప్లమా ఉన్న వారికి ప్రాధాన్యత.
వయో పరిమితి: 18-27 సంవత్సరాలు (ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, సడలింపు ఉంటుంది)
దరఖాస్తు రుసుం: రూ. 100 (ఎస్సీ / ఎస్టీ / పీహెచ్ / మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.)
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో లాగాన్ అయి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన దరఖాస్తు పేజీలో పూర్తి వివరాలు నింపి, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ కొట్టాలి. రిజిస్ట్రేషన్ విజయవంతమైన తర్వాత వచ్చే యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత దగ్గర్లోఉన్న ఏదేనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్ణీత రుసుం చెల్లించాలి. లేదా ఆన్‌లైన్‌లో కూడా ఫీజు చెల్లించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం:
11.10.2014
దర ఖాస్తులు సమర్పించడానికి చివరి తేది: 09.11.2014
ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 11.11.2014
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 09.11.2014
వివరాలకు: www.onlinesubmit.in/mha6/

పరీక్షా విధానం
ఈ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. పేపర్ 1 ఆబ్జెక్టివ్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్.
పేపర్ 1లో 100 ప్రశ్నలుంటాయి. మార్కులు 100. సమయం 100 నిమిషాలు.

పేపర్ 1:(ఆబ్జెక్టివ్-100 మార్కులు)
పేపర్ 1లో ఆరిథ్‌మెటిక్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ కింద కరెంట్ అఫైర్స్, ప్రపంచ చరిత్ర, ప్రపంచ భూగోళశాస్త్రం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర, భారత స్వాతంత్ర పోరాటం, భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ వ్యవస్థ, భారత భూగోళశాస్త్రం, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు వస్తాయి.

మారుతున్న ప్రశ్నల సరళి
ప్రతి సంవత్సరం ప్రశ్నల సరళిలో మార్పుతో పాటు కఠినస్థాయి పెరుగుతోంది.
2012, 2013లో జరిగిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను సబ్జెక్టుల వారీగా విశ్లేషించి మీకందిస్తున్నాం. దీనిని బట్టి ఒక అవగాహనకు రావచ్చు.

సబ్జెక్టులు

2012

2013

ఆర్ధమెటిక్, రీజనింగ్

21

20

ప్రపంచ చరిత్ర

06

11

ప్రపంచ, భారత భూగోళశాస్త్రం

11

05

ప్రపంచ, భారతదేశ ఆర్థికవ్యవస్థ

04

09

భారతదేశ చరిత్ర(ప్రాచీన, మధ్య, అధునిక, స్వాతంత్ర పోరాటం)

11

14

భారత రాజకీయ వ్యవస్థ

05

07

బయాలజీ

04

04

కెమీస్ట్రీ అండ్ ఫిజిక్స్

07

05

కరెంట్ అఫైర్స్ అండ్ జీకే

27

12

ఇంగ్లిష్ గ్రామర్

-

11

కంప్యూటర్ అండ్ టెక్నాలజీ

04

02

మొత్తం

100

100మొదటి 20 నుంచి 25 ప్రశ్నలు అర్ధమెటిక్, రీజనింగ్‌లో ఉంటాయి. వీటిలో నంబర్ సిరీస్, ప్రాబబిలిటీ, క్యాలెండర్, శాతాలు, నిష్పత్తి, రక్త సంబంధాలు, కాలం - దూరం, కాలం - పని, అనాలజీ(నంబర్, ఫిగర్), అరేంజ్‌మెంట్ టెస్ట్, వయస్సులు, దిక్కులు -దూరాలు, కోడింగ్-డీకోడింగ్, లాభనష్టాలు, కసాగు, గసాభా వైశాల్యాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందాలంటే ఏదైనా ప్రామాణికమైన క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పుస్తకం సాధన చేయాలి. దీంతోపాటు 8, 9, 10వ తరగతుల మ్యాథ్స్ పాఠ్యపుస్తకాలలోని మాదిరి సమస్యలను సాధన చేయడం లాభిస్తుంది. సంబంధిత అంశాల్లో ప్రాథమిక సూత్రాలను బాగా గుర్తు పెట్టుకోవాలి.

ప్రపంచ చరిత్ర కు సంబంధించి ఆయా దేశాల స్వాతంత్ర పోరాటాలు, యుద్ధాలు, వలసలు, ముఖ్యమైన సామ్రాజ్యాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖ వ్యక్తుల గురించి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన విషయాలు అధ్యయనం చేయాలి. దీనికి ఎన్‌సీఈఆర్‌టీ 8,9, 10 పదోతరగతి పుస్తకాలు చదివితే సరిపోతుంది.

జియోగ్రఫీకి సంబంధించి గ్రహాలు, ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు, ప్రకృతి సిద్ధ మండలాలు, విపత్తులు వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీనికి కూడా ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాలు చదివితే సరిపోతుంది.

చరిత్రకు సంబంధించి పురాతన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, బ్రిటిషు పరిపాలన నుంచి ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు-రాజులు, యుద్ధాలు, సంధులు, శాసనాలు, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్య్ర సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, సత్యాగ్రహాలు, సంస్థలు స్థాపకులు, మిషనరీస్ వంటి వాటిని బాగా చదవాలి.

జనరల్ సైన్స్ అయిన బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ల నుంచి దాదాపు పది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పాత ప్రశ్నా పత్రాలను చూసి బేసిక్స్‌పై పట్టు సాధించాలి. నిత్యజీవితంలో అనువర్తిత అంశాలైన రసాయనాలు ఉపయోగాలు, పరికరాలు-పని చేసే సూత్రాలు, మానవ శరీర ధర్మాలు, మొక్కలు - ఉపయోగపడే భాగాలు వంటి వాటిని క్షుణ్నంగా చదవాలి.

కరెంట్ అఫైర్‌‌సలో తాజా నియామకాలు, అవార్డులు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, జాతీయ అంశాలు, సదస్సులు వంటి వాటిని చదవాలి. దేశాల-రాజధానులు-కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు-వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జనగణన 2011 సమాచారం, భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు, చరిత్రలో ముఖ్య సంఘటనలు, ప్రముఖ కవులు-వారి ఆస్థానాలు, కట్టడాలు-నిర్మాణాలు, భారత రాజ్యాంగం సవరణలు, కమిటీలు-కమీషన్లు, ముఖ్యమైన ఆపరేషన్లు, వివిధ ఫోబియాలు, వివిధ శాస్త్రాల అధ్యయనం, భారత దేశంలోని వివిధ అవార్డులు, గ్రహీతలు, భారతదేశ రాష్ట్రాలు, ప్రముఖ నదీతీర నరగాలు, భారత అంతరిక్ష కార్యక్రమం వంటి జనరల్ నాలెడ్‌‌జ అంశాలపై దృష్టి సారించాలి.

ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగంలో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రిపొజిషన్‌‌స, అడ్వర్‌‌బ్స, కంజంక్షన్, స్పీచెస్, సింగులర్ అండ్ ప్లూరల్, టెన్సెస్, ఆంటోనిమ్స్, సిననిమ్స్ ఆర్టికల్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. రోజూ 10 కొత్త పదాలు నేర్చుకొని వాటిని వాక్యాలలో ఉపయోగించడం సాధన చేయాలి. ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం లేదా ప్రముఖ ఛానల్‌లో వచ్చే గ్రూప్ డిస్కషన్లను వినడం ఎంతో లాభిస్తుంది.

పేపర్ -II (50 మార్కులు)
పేపర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్. 50 మార్కులకు ఉంటుంది. 3 లేదా 4 వ్యాసాలు ఇచ్చి ఇంగ్లిష్‌లో 400 పదాలకు మించకుండా వ్యాసం రాయమని అడుగుతారు. ఇచ్చిన అంశం తాలుకూ ఉద్దేశాన్ని గ్రహించి అంశం కాన్సెప్ట్, నిర్వచనం, చరిత్ర, పరిణామాలు, తాజా డెవలప్‌మెంట్స్, పరిష్కారాలు సూచిస్తూ వ్యాసాన్ని ముగించాలి. చేతిరాత చక్కగా ఉంటే మంచి మార్కులు పొందవచ్చు.

రిఫరెన్స్ బుక్స్:
స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్:
ఏదైనా జనరల్ నాలెడ్ ్జ పుస్తకం, మలయాళ మనోరమ ఇయర్‌బుక్, సాక్షి కరెంట్ అఫైర్స్
రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్-ఆర్‌ఎస్ అగర్వాల్, న్యూమరికల్ ఎబిలిటీ-ఎస్ చంద్ పబ్లికేషన్స్, క్వికర్ మ్యాథ్స్
జనరల్ ఇంగ్లిష్: రెన్ అండ్ మార్టిన్ గ్రామర్ పుస్తకం, టాటా మెక్‌గ్రాహిల్ ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్ బుక్, వివిధ ఇంగ్లిష్ దినపత్రికలు
వరల్డ్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్‌లకు.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు

నోట్: స్డడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు, ఇంగ్లిష్ ఎస్సే (పేపర్ II)ల కోసం www.sakshieducation.com చూడండి.
Published on 10/20/2014 5:35:00 PM
టాగ్లు:
ఇంటెలిజెన్స్ కొలువు.. ఇలా సులువు

Related Topics