Advertisement

Exam Resources

  • ఇంటెలిజెన్స్ కొలువు.. ఇలా సులువు

    img.jpg సరిహద్దుల్లో రక్షణ కవచాలు సైనికులైతే, దేశం లోపల అంతర్గత భద్రతకు పొంచి ఉన్న ముప్పును పసిగట్టేవారు ఇంటెలిజెన్స్ అధికారులు. ఉగ్రవాదులు, నక్సలైట్లు, ఇతర సాంఘిక వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై నిఘా ఉంచి వాటిని నియంత్రించడంలో వీరి కృషి ఎనలేనిది. నిరంతరం శాంతి భద్రతలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తూ ప్రభుత్వాన్ని, అప్రమత్తం చేస్తారు. ఇంతటి బాధ్యతాయుత ఉద్యోగంలో ప్రవేశించాలంటే అపరిమిత నాలెడ్జ్, సామాజిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. వీటికి తోడు పరిసరాలను పసిగట్టగలిగే తెలివి తేటలు, కోవర్టు ఆపరేషన్లు నిర్వహించగలిగే ధైర్యసహాసాలు తప్పనిసరి. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ దేశవ్యాప్తంగా 750 అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తరుణంలో పరీక్ష ప్రణాళికపై విశ్లేషణ...

    దేశ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం 25 వేల మంది నిఘా అధికారులు అవసరం కాగా కేవలం 3 వేల మంది మాత్రమే పని చేస్తున్నారు.

    ఐబీ గురించి.. ఈ సంస్థ 1887లో బ్రిటిష్ కాలంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఫర్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా ఏర్పడింది. దీనిని 1947లో హోం మంత్రిత్వ శాఖ కింద సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా మార్చారు. భద్రతాపరమైన అంశాలకు సంబంధించి దేశం వెలుపల, లోపల సమాచారాన్ని సేకరించడం...

Read more...           img.jpg

Discuss Here