అత్యున్నత కెరీర్‌కు మార్గం సుగమం చేసే ఐసెట్


Bavithaగ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులకు అత్యున్నత కెరీర్ దిశగా మార్గం సుగమం చేసే కోర్సుల్లో ప్రధానమైనవి.. ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు. మారుతున్న ఉద్యోగావసరాలకనుగుణంగా జాబ్ మార్కెట్ డిమాండ్ మేరకు సాంకేతిక, వ్యాపార నైపుణ్యాన్ని అందించే ఈ కోర్సుల్లో చేరడానికి ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)..ఈ పరీక్ష ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాన్ని ఖరారు చేసుకోవచ్చు. 2014 సంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రిపరేషన్ ప్లాన్, నిర్వహణ తీరుతెన్నులపై ఐసెట్ కన్వీనర్ ఇంటర్వ్యూ, తదితర వివరాలు..

అభ్యర్థిలోని వెర్బల్ (శాబ్దిక), మ్యాథమెటికల్ (గణిత) నైపుణ్యాలను ఒక క్రమ పద్ధతిలో పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష ఐసెట్. ఇందులో కచ్చితత్వానికి ప్రాధాన్యతనిస్తారు. పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. మొత్తం 200 మార్కులకు మూడు విభాగాలుగా పరీక్షను నిర్వహిస్తారు. వివరాలు..
విభాగం మార్కులు
సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ
డేటా సిఫీషియన్సీ 20
ప్రాబ్లమ్ సాల్వింగ్ 55
సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ
అర్థమెటిక్ ఎబిలిటీ 35
ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ 30
స్టాటిస్టికల్ ఎబిలిటీ 10
సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ
వొకాబ్యులరీ 10
బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 10
ఫంక్షనల్ గ్రామర్ 15
రీడింగ్ కాంప్రెహెన్షన్ 15
మొత్తం 200
సమయం 150 నిమిషాలు

ప్రిపరేషన్ ప్లాన్:
కమ్యూనికేషన్ ఎబిలిటీ:
కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగాన్ని తీసుకుంటే ఇది ప్రధానంగా అభ్యర్థిలోని ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించింది. ఇందులోని ప్రశ్నలు వొకాబ్యులరీ, ఫంక్షనల్ గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్ ఆధారంగా ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.. వొకాబ్యులరీ విభాగంలో సమాధానం గుర్తించాలంటే ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం, పట్టు సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా గ్రామర్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాలు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇడియమ్స్, ఫ్రేజెస్, సీక్వెన్సెస్ ఆఫ్ టెన్సెస్, వెర్బ్ ప్యాట్రన్స్, కొశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఆఫ్ సెంటెన్సెస్ వంటి అంశాలపై అధికంగా దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో ఇచ్చిన ప్యాసేజ్‌ను ముందుగా చదవి.. దాని నేపథ్యాన్ని విశ్లేషిస్తూ అవగాహన చేసుకోవాలి. తద్వారా సమాధానాలు గుర్తించడం సులభమవుతుంది. ప్రతిరోజూ ఇంగ్లిష్ దినపత్రికలు, మ్యాగజీన్లు చదవడం ద్వారా ఈ విభాగంలో పట్టు సాధించవచ్చు.

కమ్యూనికేషన్ ఎబిలిటీలోని మరో విభాగం బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ. ఇందులో బిజినెస్, కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి ఐదు ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ ప్రశ్నలు ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక అవగాహనను పరీక్షించే స్థాయిలో ఉంటాయి. కంప్యూటర్, బిజినెస్ రంగానికి సంబంధించి అబ్రివేషన్స్ తెలిసి ఉండాలి. ఈ విభాగం కోసం గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తూ అందులోని అంశాలాధారంగా మార్కెట్లో లభించే ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మ్యాట్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరం.

ఈ విభాగాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇందులో కనీసం 30కి పైగా మార్కులు సాధిస్తేనే మంచి ర్యాంకు సాధించవచ్చు. ప్రిపరేషన్ దృష్ట్యా కూడా ఈ విభాగం చాలా సులువైంది. ఎందుకంటే ఇందులోని ప్రశ్నలను సాధించడానికి తార్కికత అవసరం లేదు. చక్కని స్కోరింగ్ చేయడానికి ఈ విభాగాన్ని ఉపయోగించుకోవచ్చు.

అనలిటికల్ ఎబిలిటీ:
ఇందులో డేటా సిఫీషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. డేటా సఫిషియన్సీలో ప్రతి ప్రశ్నకు ఐ,ఐఐ అనే రెండు స్టేట్‌మెంట్లు ఇస్తారు. వీటి ఆధారంగా సమాధానం గుర్తించాలి. ఈ క్రమంలో స్టేట్‌మెంట్ ఐ అవసరమా స్టేట్‌మెంట్ ఐఐ అవసరమా లేదా రెండూ అవసరమా అనే అంశాన్ని అభ్యర్థి విశ్లేషించాల్సి ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు అర్థమెటిక్, జ్యామెట్రీ, బీజగణిత విభాగాల నుంచి వస్తాయి. కాబట్టి ఆయా అంశాలపై దృష్టి సారించాలి. విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి.

ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగాన్ని నాలుగు ఉప విభాగాలుగా విభజించారు. అవి.. సీక్వెన్సెస్ అండ్ సిరీస్ (25 ప్రశ్నలు), డేటా అనాలిసిస్ (10 ప్రశ్నలు), కోడింగ్-డీకోడింగ్ (10 ప్రశ్నలు), డేట్ అండ్ టైమ్ ఆరేంజ్‌మెంట్ ప్రాబ్లమ్స్ (10 ప్రశ్నలు). వీటిల్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్‌లో అనాలజీ, నంబర్ సిరీస్, అల్ఫాబెట్ సిరీస్, క్లాసిఫికేషన్, ఆడ్‌మ్యాన్ అవుట్ వంటి ప్రశ్నలు వస్తాయి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే 1-20 వరకు టేబుల్స్, 1-30 వరకు వర్గమూలాలు, 1-20 వరకు ఘనాలు, A&Z, Z&A వరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువలపై పట్టు సాధించాలి. డేటా అనాలిసిస్‌లో పట్టికలు, వెన్ చిత్రాలు, లాజికల్ వెన్ చిత్రాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను సాధించాలంటే నిష్పత్తి, సగటు, శాతం వంటి అంశాలపై అవగామన తప్పనిసరి. అంతేకాకుండా పరిశీలన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇచ్చిన చిత్రాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే సమాధానాన్ని గుర్తించడం శ్రేయస్కరం. కోడింగ్-డీకోడింగ్‌లో మెరుగైన మార్కులకు A&Z, Z&Aవరకు అక్షర క్రమం (ముందు నుంచి వెనక్కు, వెనక నుంచి ముందుకు), స్థాన విలువల పై పట్టు సాధించాలి. డేట్ అండ్ టైమ్‌లో సీటింగ్ ఆరేంజ్‌మెంట్, వయసు, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆరైవల్, డిపార్చర్, షెడూల్స్‌పై ప్రశ్నలు వస్తాయి.

మ్యాథమెటికల్ ఎబిలిటీ: అత్యంక కీలక విభాగం మ్యాథమెటికల్ ఎబిలిటీ. అభ్యర్థుల వేగాన్ని, కచ్చితత్వాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో మూడు ఉప విభాగాలు ఉంటాయి. అవి.. అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ,స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఒక రకంగా దీన్ని ప్యూర్ మ్యాథమెటికల్ విభాగంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మెరుగైన స్కోర్ సాధించాలంటే సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంతోపాటు షార్ట్‌కట్ మెథడ్స్, కొండ గుర్తులను రూపొందించుకోవాలి.

అర్థమెటికల్ ఎబిలిటీలో ఘాతాంకాలు, నిష్పత్తి, భాజనీయత సూత్రాలు, కసాగు-గసాభా, శాతాలు, ఆకరణీయ సంఖ్యలు, లాభ నష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, క్షేత్రమితి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లోని సంబంధిత సమస్యలను సాధన చేయాలి.

ఆల్జీబ్రాకల్ అండ్ జీయో మెట్రికల్ ఎబిలిటీ విభాగంలో సమితులు, సంబంధాలు, ప్రవచనాలు, బహుపదులు, ప్రమేయాలు, ద్విపద సిద్ధాంతం, వర్గ సమీకరణాలు, మాత్రికలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, త్రికోణమితి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. వీటి కోసం 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలను చదివితే సరిపోతుంది. పాలిసెట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి.

స్టాటిస్టికల్ ఎబిలిటీలో సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఆయా అంశాల్లో అభ్యర్థుల ప్రాథమిక అవగాహనను పరీక్షించే విధంగా పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఇ స్తారు. సాంఖ్యక శాస్త్రం కోసం 10వ తరగతి గణిత పుస్తకాలు, సంభావ్యత కోసం 10వ తరగతి, ఆపై స్థాయి తరగతుల గణిత పుస్తకాలను చదవాలి.

ఇన్ పుట్స్:
లలితాబాయి,
ఎస్.ఎం.ఎల్.సి. కేశవ రావు.

టిప్స్
  • కనీసం రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
  • గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి.
  • పరీక్ష నాటికి కనీసం ఏడు మాక్ టెస్ట్‌లు రాయాలి.
  • కనీసం 165కిపైగా మార్కులు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. అప్పుడే మంచి కాలేజీలో సీటు సాధించవచ్చు.
బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ వాడాలి
Bavithaగతేడాది మాదిరిగానే ఈసారీ కాకతీయ యూనివర్సిటీ ఐసెట్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిర్వహణ ఏర్పాట్లపై ఐసెట్-2014 కన్వీనర్ ప్రొఫెసర్ కె. ఓంప్రకాశ్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ..

ఐసెట్ -2014 ఏర్పాట్లు:
ఐసెట్‌ను సక్రమంగా సకాలంలోనే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. గతంతో పోల్చితే ఈసారి కొన్ని మార్పులు చేశాం. గతంలో నెల రోజుల ముందుగానే దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేది. ఆతర్వాత వచ్చే దరఖాస్తులను అనుమతించే వాళ్లం కాదు. కానీ ఈసారి వారం రోజుల ముందు కూడా అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం.

ఎంతమంది హాజరు కాబోతున్నారు?
గత ఏడాది ఐసెట్ -2013లో 1,39,314 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 1.50 లక్షల దరఖాస్తులు రావొచ్చని అంచనా. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసేటప్పుడు నిబంధనలు చదివి దరఖాస్తును క్షుణ్నంగా పూరించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులో అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాన్ని స్పష్టంగా పేర్కొనాలి. హాల్‌టికెట్లు, ర్యాంకు కార్డులు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడు చేసుకోవాలి.

కొత్తగా మార్పులు:
ఖమ్మం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల్లోని ఏజెన్సీల అభ్యర్థుల కోసం ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో మరో పరీక్షా కేంద్రం కొత్తగూడెంలో ఏర్పాటు చేశాం. మే రెండోవారం కల్లా ఐసెట్ నిర్వహణకు రీజినల్ కోఆర్డినేటర్లను నియమించే ప్రక్రియ పూర్తి చేస్తాం. అభ్యర్థులు ప్రధానంగా గమనించాల్సిన మార్పు.. గతంలో ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలను గుర్తించేందుకు పెన్సిల్‌ను వినియోగించాల్సి ఉండేది. కానీ ఈసారి నుంచి అభ్యర్థులు సమాధానాలను గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలి.

దరఖాస్తు సమయంలో తప్పులు దొర్లితే?
దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు దొర్లితే హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక కూడా కొన్ని అంశాలను సవరించుకునే అవకాశం ఉంది. అయితే పేరు, ఇతర అంశాలకు సంబంధించిన సవరణలు మాత్రమే అనుమతిస్తాం. పరీక్షాకేంద్రం, హెల్ప్‌లైన్ సెంటర్‌ను మాత్రం మార్చుకునే వీల్లేదు. ఏవైనా సందేహాలు ఉంటే కన్వీనర్ పేరిట ఉన్న ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ఫలితాలు ఎప్పుడు?
మే 26వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తాం. కీ విషయంలో జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాం. జూన్ 9వ తేదీన ఫలితాలను, ఫైనల్ ‘కీ’ కూడా విడుదల చేస్తాం.

అభ్యర్థులకు సూచనలు ?
పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్‌పెన్‌ను మాత్రమే వినియోగించుకోవాలి. ఓఎంఆర్‌షీట్‌లో అన్నికాలాలను పూరించాలి. ఏమైనా ఇతర సమాచారం కోసం convenericet2014@gmail.com మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
- డి.రమేష్, న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్.

ఐసెట్-2014 నోటిఫికేషన్ సమాచారం
అర్హత: ఎంబీఏ-50 శాతం మార్కులతో(రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ.
ఎంసీఏ-50 శాతం మార్కులతో (రిజర్వ్ అభ్యర్థులకు 45 శాతం) బ్యాచిలర్ డిగ్రీ. 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దూర విద్య డిగ్రీకి యూజీసీ, ఏఐసీటీఈ, డీఈసీ జాయింట్ క మిటీ గుర్తింపు ఉండాలి.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 250
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2014.
రూ. 500 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 15, 2014
రూ. 2,000 లేట్ ఫీజుతో: ఏప్రిల్ 25, 2014
రూ. 5,000 లేట్ ఫీజుతో: మే 6, 2014
రూ. 10,000 లేట్ ఫీజుతో: మే 19, 2014
పరీక్ష తేదీ: మే 23, 2014
వివరాలకు: www.apicet.org.in
Published on 3/6/2014 4:55:00 PM
టాగ్లు:
ICET Preparation plan ICET 2014 Preparation guidance ICET 2014 Exam schedule ICET 2014Notification ICET 2014

Notification

notification.jpg

ICET-2016 is an Integrated Common Entrance Test (ICET) for admission into MBA and MCA courses of all Universities in Telangana...

click here...

Syllabus

syllabus.jpg

The test is designed to measure the candidate's ability to think systematically, to use the verbal and mathematical skills and to assess his/her aptitude for...

click here...

Ask The Expert

ask.jpg

Send your queries to education@sakshi.com Our experts Rameswar Mandali, Kesava Rao, Ravipal Reddy, Anil Kumar, P.V.Ch. Sastry, Vijendar Reddy shall answer your queries.

Related Topics