ఏఏఎస్‌ఎల్‌లో 10 పోస్టులు

ఎయిరిండియా లిమిటెడ్‌కు చెందిన ఎయిర్‌లైన్ అలైడ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఏఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన 10 కో-పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsఅర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. డీజీసీఏ జారీచేసిన సీపీఎల్, కరెంట్ ఎఫ్‌ఆర్‌టీవో వంటివి ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: సిమ్యులేటర్ ప్రొఫిషియన్సీ అసెస్‌మెంట్ చెక్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్. మొదట సంబంధిత వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని దానికి అవసరమైన పత్రాలు జతచేసి సంస్థ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు ఉచితం; మిగిలిన వారికి రూ.3000.
దరఖాస్తుకు చివరితేదీ: నవంబర్ 30, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.airindia.in
Published on 5/7/2019 5:02:00 PM

Related Topics