కొత్త ప్రయాణం...మీ నడకతో మొదలు...

SSJఉరికించే ఉత్సాహం...ఒకింత సాహసం...అనుక్షణం కొత్తదనం...కోరుకుంటున్నారా? అక్షరాలతోరోజూ లక్షలాది మందినిపలకరించాలా? సంపాదనతోపాటు సంతృప్తీ ముఖ్యమా? అయితే ఈ కొత్త ప్రయాణానికి సిద్ధం కండి !మీరు వెదికే వేదిక ఇదే!పదుగురి జీవితాలను ప్రభావితం చేయగల మీడియా రంగానికి సాక్షిస్వాగతం అంటోంది. పత్రిక, టీవీ, వెబ్‌సైట్లలో ఎక్కడయినా ఎదగడానికి చక్కని అవకాశం కల్పిస్తుంది.
ప్రతిభ మీది...ప్రోత్సాహం మాది!

దరఖాస్తు చేసుకోండిలా...:
వెబ్‌సైట్లలో దరఖాస్తులు ఉంటాయి. అందులోని సూచనలు క్షుణ్నంగా చదవండి -ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసి, సబ్‌మిట్ చేయాలి. -మీ తాజా పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రింటవుట్ తీసుకుని సాక్షి జర్నలిజం స్కూలు చిరునామాకు సాధారణ పోస్టు ద్వారా పంపండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపే సమయంలోనే రూ. 200 ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల్లో దేంతోనైనా చేయొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఒక యునీక్ నంబర్ వస్తుంది. దాన్ని వేసి, దరఖాస్తు నింపే ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు వస్తుంది. ఆ నంబర్ సాయంతో ఏప్రిల్ 16(సోమవారం) మధ్యాహ్నం 3గంటలు నుంచి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రెండు దశల్లో ఎంపిక...:
అభ్యర్థుల ఎంపిక రెండు దశలు. మొదటి దశలో 2 రాతపరీక్షలు ఉంటాయి. మొదటి పేపర్లో తెలుగు, ఇంగ్లిష్, కరెంట్ అఫైర్‌‌సపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు; రెండో పేపర్లో తెలుగు, ఇంగ్లిష్ పరిజ్ఞానం, అనువాదం, కరెంట్ అఫైర్‌‌సపై వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సాక్షి ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. నమూనా ప్రశ్నపత్రాలు సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం, సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లలో ఉంటాయి. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చ, మౌఖిక పరీక్ష ఉంటాయి. ఇందులోనూ ఉత్తీర్ణులైన వారిని శిక్షణ కోసం ఎంపిక చేస్తాం.

నైపుణ్యానికి పదును...
ఏడాదిపాటు ఆసక్తిగా సాగే ఈ శిక్షణ... తరగతి గదులు..క్షేత్రస్థాయిలోనూ ఉంటుంది. మీడియా వృత్తిపై ప్రాథమిక అవగాహనతోపాటు మీడియాలో పనిచేయడానికి అవసరమైన తెలుగు, ఆంగ్ల భాషా నైపుణ్యాలు, ఎడిటింగ్, రిపోర్టింగ్, అనువాదం, వర్తమాన వ్యవహారాలు నేర్పిస్తారు. చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం మొదలైన వాటిపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.

ఒప్పందం:
అభ్యర్థులు శిక్షణకాలంతోపాటు సాక్షిలో నాలుగేళ్లు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పందపత్రం (బాండ్ అగ్రిమెంట్) ఇవ్వాలి. సాక్షి ప్రచురణ కేంద్రాల్లో, కార్యక్షేత్రాల్లో ఎక్కడైనా ఉద్యోగం చేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.

శిక్షణ భృతి (నెలవారీ)...:(బాక్స్)
  • మొదటి ఆరు నెలలు రూ. 10,000
  • తరవాతి ఆరునెలలు రూ. 12,000
  • ఏడాదిపాటు ట్రెయినీగా ..15,000
-తదనంతరం సంస్థ నిబంధనలకు లోబడి అభ్యర్థి జీతభత్యాల పెంపు ఉంటుంది.

మీకు ఉండాల్సింది...
  • తెలుగు మీద పట్టు
  • ఆంగ్లంపై అవగాహన
  • డిగ్రీ ఉత్తీర్ణత
  • 1-03-2018 నాటికి
  • 30 ఏళ్లకు మించని వయసు
దరఖాస్తు తుది గడువు:13-04-2018
రాతపరీక్ష: 22-04-2018 (ఆదివారం)
రాత పరీక్ష ఫలితాలు : 14-052018
ఇంటర్వ్యూలు : 21-5-2018 నుంచి
తుది ఫలితాలు : 06-06-2018
తరగతులు ప్రారంభం :14-06-2018 నుంచి

చిరునామా:
ప్రిన్సిపల్,
సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం,
ఆరోఫ్లోర్,ఎం.జి.ఆర్. ఎస్టేట్,
మోడల్ హౌస్ వెనక, పంజగుట్ట, హైదరాబాద్ -500082
ఫోన్: 040 23354715
సమయం: ఉ.10 సా. 5గం.(ఆదివారం తప్ప)

మ‌రిన్ని వివ‌రాల‌కు క్లిక్ చేయండి.