quit

ఆరంభంలోనే అంతరాయం

మొదలుకాని భద్రాచలం గిరిజన డీఈడీ కళాశాల ప్రవేశాలు
భద్రాచలం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయదలచిన డీ ఈడీ కళాశాల ఇప్పట్లో ప్రారంభమయ్యేలా కనిపించటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డీఈడీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. జనవరి చివరి వారంలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది కళాశాల ప్రారంభంపై సందిగ్ధం ఏర్పడింది. గిరిజన సంక్షేమ అధికారుల నిర్ణయాలే ఇందుకు కారణమని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక గిరిజన విద్యార్థుల బీఈడీ కళాశాల భద్రాచలంలో 2000లో ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులకు ఈ కళాశాలలో ప్రవేశాలు కల్పించి ఉపాధ్యాయ శిక్షణ ఇస్తున్నారు. రెండువందల బీఈడీ సీట్లున్న గిరిజన కళాశాల రాష్ట్రంలో ఇదే మొదటిది. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన విద్యార్థులకు ఎడ్‌సెట్ లేకుండా డిగ్రీ మార్కుల ప్రాతిపదికన సీటు ఇచ్చే బీఈడీ కళాశాల కూడా రాష్ట్రంలో ఇదొక్కటే. కేయూ పరిధిలో మంచి ఫలితాలు సాధించడంతో 2012 నవంబర్‌లో జీవో నంబర్ 786తో భద్రాచలంలో 50 సీట్లతో డీఈడీ కళాశాల ఏర్పాటుకు అనుమతి లభించింది.

గిరిజనులందరికీ ప్రవేశాలతోనే సందిగ్దత...: భద్రాచలంలో ప్రస్తుతం ఉన్న బీఈడీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులకే ప్రవేశాలు కల్పిస్తున్నారు. డీఈడీ కళాశాలలో కూడా ఈవిధంగానే చేయాలని ఇక్కడ అధికారుల ఆలోచన. కానీ ప్రభుత్వం డీఈడీ కళాశాల మంజూరు ఉత్తర్వుల్లో మాత్రం రాష్ట్రంలో ఎక్కడి గిరిజన అభ్యర్థులైనా ఇక్కడ ప్రవేశం పొందవచ్చని పేర్కొంది. అంతేకాక కళాశాలను డీఈడీ కన్వీనర్ కోటాలో చూపించి, సీట్లను కూడా నేరుగా కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది.

దీంతో ఇక్కడి అధికారులు అయోమయానికి గురయ్యారు. ప్రస్తుతం ఉన్న బీఈడీ కళాశాలలో ఎడ్‌సెట్ లేకుండా, భద్రాచలం ఐటీడీఏ పీవో కన్వీనర్‌గా సీట్లను భర్తీ చేస్తున్నారు. డీఈడీ కళాశాలలో కూడా ఇదేరీతిన చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు వేరుగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. ఈ విషయాన్ని గిరిజన సంక్షేమశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి కూడా దీనిపై గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే ప్రభుత్వం కొత్తగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేసిన డీఈడీ కళాశాలల్లో మైదాన, ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఇదే రీతిన భద్రాచలం డీఈడీ కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఇక్కడి ప్రత్యేక పరిస్థితిని ఐటీడీఏ అధికారులు ప్రభుత్వం దృష్టికి సకాలంలో తీసుకెళ్లలేకపోవటంతోనే ఈ సమస్య ఉత్పన్నమయిందని గిరిజన సంఘాలు అంటున్నాయి.

ఈ ఏడాది ప్రవేశాలు లేనట్లేనా..?

భద్రాచలంలో డీఈడీ కళాశాలకు ప్రభుత్వం అనుమతించినా ఈ ఏడాది దీన్ని ప్రారంభించే పరిస్థితి లేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీఈడీ కళాశాలల్లో రెండు దఫాలుగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ కూడా పూర్తయింది. అయితే భద్రాచలం డీఈడీ కళాశాల విషయంలో ఇక్కడి అధికారులు పంపించిన ఫైలు గిరిజన సంక్షేమ, ప్రైమరీ విద్యాశాఖల కార్యాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిబంధనల మేరకు డీఈడీ అభ్యర్థులు అందుబాటులో లేక ఏజెన్సీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఖాళీలు ఉండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తగు నిర్ణయాన్ని ప్రకటించి ఏడాది నష్టపోకుండా చూడాలని ఉపాధ్యాయ శిక్షణను ఆశిస్తున్న గిరిజన విద్యార్థులు కోరుతున్నారు.

www.sakshieducation.com
టాగ్లు:
ఆరంభంలోనే అంతరాయం
 
Published on
 
 
 
pixel
Quick Links
Jobs in Telugu
State Govt Jobs
Bank Jobs
Defence Jobs
Engineering Jobs
Faculty & Non-faculty Jobs
Miscellaneous Jobs
Medical Jobs
Navaratna & Miniratna Jobs
Private Jobs
Public Service Commission/SSC Jobs
Railway Jobs
Research/Scientist Jobs
Security / Police Force Jobs
Walk-ins
pixel
Home | About Us | Disclaimer | Contact us at education@sakshi.com
Engineering | Competitive Exams | Tenth Class | Intermediate | Eamcet | Sitemap
Copyright © 2010 sakshieducation.com. All rights reserved.
Site is Best viewed in Internet Explorer 7 & above with 1024 × 768 Resolution
pixel
quit

Receive All Updates Via Facebook