Sakshi education logo

41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు

సాక్షి, హైదరాబాద్: విజయనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఉగాది, హంస అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 18 రంగాలకు చెందిన 41 మంది ప్రముఖులను ఉగాది పురస్కారాలకి, 9 రంగాలకు చెందిన 15 మంది ని హంస పురస్కారాలకు ఎంపిక చేశారు. ఉగాది పండుగ రోజున జరిగే కార్యక్రమంలో వివిధ రంగాల ప్రవుుఖులను ప్రభుత్వం నగదు పురస్కారాలతో సన్మానించనుంది. ఉగాది పురస్కార గ్రహీతలకు రూ. 5,116, హంస పురస్కార గ్రహీతలకు రూ.30 వేల చొప్పున అందించనున్నట్టు సాంస్కృతిక శాఖ సోమవారం తెలిపింది. ఎంపికైన వారి వివరాలివీ..

ఉగాది పురస్కారాలు..

సాహిత్యం: ఉమర్ అలీషా, మానాప్రగడ శేషసాయి, తిరునగరి, శరత్ జ్యోత్స్నారాణి, జి.వి.పూర్ణచంద్, గెద్దాడ కస్తూరి సంగీతం: పి.వి.శేషయ్య శాస్త్రి, కోట అచ్చిబాబు, సత్యవాడ సోదరీమణులు నృత్యం: అర్ధనారీశ్వర వెంకట్, డాక్టర్ సువర్చల చిత్రకళ: అంబాజీ నాటకం: కందిమళ్ల సాంబశివరావు, పల్లేటి లక్ష్మీ కులశేఖర్, సురభి ప్రభావతి, శ్రీపాద మోహన్ మిత్రా (జిత్ మోహన్‌మిత్రా), ఆకెళ్ల వేంకట సూర్యనారాయణ, రజిత మూర్తి వ్యక్తిత్వ వికాసం: డాక్టర్ బి.వి. పట్టాభిరాం మిమిక్రీ: మిమిక్రీ శ్రీనివాస్, సిల్వెస్టర్ జానపద రంగం: జయరాజు, పి.వి.చలపతిరావు, లక్ష్మీ నారాయణ (హరికథ), హేమ కుమారి (బుర్రకథ) సినిమా: ఏడిద నాగేశ్వరరావు, మద్దాలి వేంకటేశ్వరరావు, మాడా జర్నలిజం: పిరాట్ల వెంకటేశ్వర్లు. సినీ జర్నలిజం: ఎస్.వి.రామారావు గ్రంథాలయోద్యమం: వెలగా వెంకటప్పయ్య ఫొటోగ్రఫీ: టి.ఎస్.రెడ్డి వైద్యం: ఉమేష్ చంద్ర, జగదీష్, సూర్యనారాయణ రాజు, గురువారెడ్డి హస్తకళలు: ఐల అనంతాచారి(పెంబర్తి) ఇతర ప్రాంతాల తెలుగువారు: నరసింహ అప్పడు (మలేసియా), టి.సంజీవరావు (చెన్నై) యువ సాంస్కృతిక పురస్కారం: శ్రుత కీర్తి ఇతరులు: అమ్ములపూడి వేంకటేశ్వర శ్రీను (సిద్ధాంతి)

హంస పుర స్కారాలు (కళారత్న)

సాహిత్యం: డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్య, డాక్టర్ ఎస్. గంగప్ప సంగీతం: మల్లాది సూరిబాబు, శోభరాజు, తరిగొప్పుల నారాయణ (డోలు) నృత్యం: వేదాంతం రాధేశ్యాం, ఓలేటి రంగమణి చిత్రలేఖనం: సూరపనేని జనార్దన్ శిల్పం: వేలు స్తపతి అవధానం: నరాల రామారెడ్డి వ్యంగ్య చిత్రాలు: బాలి జానపదం: కుంట ఓదెలు (ఒగ్గుకథ), బి.వి.రత్నం (డప్పు) నాటకరంగం: పాటిబండ్ల ఆనందరావు, పావలా శ్యామల

Published on 4/9/2013 3:39:00 PM

Related Topics