Advertisement

ఓఐసీఎల్‌లో 606 అసిస్టెంట్ ఉద్యోగాలు

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్)... అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 606 అసిస్టెంట్ (గ్రేడ్-3 సహాయక) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
Jobs

కేటగిరీ వారీగా ఖాళీలు (ఏపీ+టీఎస్):

కేటగిరీ

ఖాళీలు

ఎస్సీ

13

ఎస్టీ

6

ఓబీసీ

7

అన్ రిజర్వ్‌డ్

26

మొత్తం

52


 • తుది నియామకాల్లో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయిస్తారు.
 • వేతనం: ప్రారంభంలో అన్నీ కలుపుకొని రూ.15000 వరకు వేతనం లభిస్తుంది.
 • అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. లేదా హయ్యర్ సెకండరీ బోర్డ్ నుంచి ఇంటర్ లేదా తత్సమాన అర్హత. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
 • వయసు: 2015, జూలై 1 నాటికి 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు; వితంతు, విడాకులు తీసుకున్న మహిళలకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
 • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రొఫిసియన్సీ టెస్ట్‌లు ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రత్యేకించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎలాంటి మార్కులు కేటాయించలేదు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలలో సాధించిన మార్కులకు 70:30 వెయిటేజీ ఇచ్చి, తుది ఎంపిక చేపడతారు.


పరీక్షా విధానం:
ఆన్‌లైన్ పరీక్ష 250 మార్కులకు ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో, ఇంగ్లిష్/ హిందీ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

రీజనింగ్

40

50

ఇంగ్లిష్ లాంగ్వేజ్

40

50

న్యూమరికల్ ఎబిలిటీ

40

50

జనరల్ అవేర్‌నెస్

40

50

కంప్యూటర్ నాలెడ్జ్

40

50

మొత్తం

200

250


 • దరఖాస్తు విధానం: అన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
 • ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఓఐసీఎల్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు రూ.50. మిగిలిన అభ్యర్థులకు రూ.500. దరఖాస్తు ఫీజును క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.


ముఖ్య తేదీలు:

 • ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 28, 2015.
 • ఆన్‌లైన్ పరీక్ష: 2015, ఆగస్టు
 • పరీక్షా కేంద్రాలు:
  ఆంధ్రప్రదేశ్: విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, తిరుపతి, కర్నూలు, నెల్లూరు.
  తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, కోదాడ, ఖమ్మం.
 • వెబ్‌సైట్: www.orientalinsurance.org.in


ప్రిపరేషన్ ప్రణాళిక

 • రీజనింగ్: ఈ విభాగం నుంచి కోడింగ్, డీ కోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలోజిమ్స్, కోడెడ్ ఇన్ ఈక్వాలిటీస్, పజిల్స్, బ్లడ్ రిలేషన్స్, డైరక్షన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్లడ్ రిలేషన్స్, ఏజెస్, డేటా సఫీషియన్సీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.
 • ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రెహెన్షన్ రీడింగ్, వొక్యాబులరీ నాలెడ్జ్, గ్రామర్ స్కిల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. కాంప్రెహెన్షన్ ప్రశ్నలు అభ్యర్థులు తేలిగ్గా గుర్తించే విధంగా ఉంటాయి. ఈ విభాగం నుంచి 12-15 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కరక్షన్ ఆఫ్ ెంటెన్స్, జంబ్లింగ్ ఆఫ్ సెంటెన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • జనరల్ అవేర్‌నెస్: జనరల్ అవేర్‌నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నోబెల్ ప్రైజ్ విజేతలు, క్రీడలు-విజేతలు, ఈ మధ్య కాలంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు (ఉదా: పీఎంఈజీపీ) వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఉదా: కొత్తగా ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు అనుమతి పొందిన బ్యాంకు ఏది? దీనికి సమాధానం కొటక్ మహీంద్రా బ్యాంకు.
 • న్యూమరికల్ ఎబిలిటీ: సింప్లిఫికేషన్, సింప్లిషికేషన్ ఆఫ్ ఎడిషన్, సబ్‌స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, స్వ్కేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ నుంచి 15 ప్రశ్నలు వరకు వస్తాయి. క్వాడ్రాడిక్ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్ సిరీస్, యావరేజెస్, రేషియోస్, ప్రాఫిట్-లాస్, టైం-వర్క్, టైం-డిస్టెన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • కంప్యూటర్ నాలెడ్జ్: ఇందులో ప్రశ్నలు ఇంటర్నెట్ అండ్ నాన్ ఇంటర్నెట్ విభాగాల నుంచి ఉంటాయి. ఇంటర్నెట్ సెక్షన్‌లో నెట్‌వర్క్ ఇష్యూస్, టైప్స్ ఆఫ్ నెట్‌వర్క్స్, కంప్యూటర్ రంగంలో లేటెస్ట్ అప్‌డేట్స్, వైరస్, యాన్టీ వైరస్, ఫైర్ వాల్స్‌పై ప్రశ్నలుంటాయి. నాన్ ఇంటర్నెట్ సెక్షన్ నుంచి కంప్యూటర్ హార్డ్‌వేర్ యూసేజ్ అండ్ ఫంక్షనింగ్, ఫంక్షనింగ్ ఆఫ్ ర్యామ్, క్యాచీ మెమొరీ, రిజిస్టర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.

- కె.వి.జ్ఞానకుమార్, డెరైక్టర్, డీబీఎస్

www.sakshieducation.com
Published on 7/16/2015 5:56:00 PM

Comment

Related Topics

Advertisement

Advertisement