ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్-2019 ప్రిపరేషన్ టిప్స్...


స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-బి నాన్ గెజిటెడ్ ‘జూనియర్ ఇంజనీర్’(జేఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిద్వారా సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, డెరైక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ల్లో.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ జేఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ -2019 నోటిఫికేషన్ వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్...
Career Guidance
 1. సెంట్రల్ వాటర్ కమిషన్(సివిల్, మెకానికల్):
  వయసు:
  32 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (లేదా) సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ.

 2. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సివిల్):
  వయసు:
  32 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

 3. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (ఎలక్టిక్రల్):
  వయసు:
  32 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.

 4. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్(సివిల్):
  వయసు :
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండేళ్ల పని అనుభవం.

 5. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్(ఎలక్ట్రికల్, మెకానికల్):
  వయసు :
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ (లేదా) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్టిక్రల్/ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం.

 6. ఫరక్క బ్యారేజీ ప్రాజెక్టు (సివిల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్‌లో విభాగంలో డిప్లొమా.

 7. ఫరక్క బ్యారేజీ ప్రాజెక్టు (ఎలక్ట్రికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా.

 8. ఫరక్క బ్యారేజీ ప్రాజెక్టు (మెకానికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా.

 9. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (సివిల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. (లేదా) మూడేళ్ల సివిల్ డిప్లొమాతోపా టు సివిల్ ఇంజనీరింగ్‌లో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మెయింటెన్స్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

 10. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. (లేదా)ఎలక్ట్రికల్/ఆటో మొబైల్/ మెకానికల్ విభాగంలో డిప్లొమాతోపాటు సంబంధిత విభాగంలో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, మెయింటె నెన్స్ విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
  సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్

 11. స్టేషన్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధింత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

 12. నేవల్, డెరైక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్(మెకానికల్, ఎలక్ట్రికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపుపొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. (లేదా) సంబంధిత విభాగంలో డిప్లొమాతోపాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

 13. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్):
  వయసు:
  30 ఏళ్లకు మించకూడదు.
  విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
  గమనిక: అన్ని విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓబీసీలకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
  పేస్కేల్: రూ.35,400 - రూ.1,12,400

ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియలో పేపర్1(కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష), పేపర్ 2(డిస్క్రిప్టివ్ పరీక్ష), సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది. పేపర్1లో నార్మలైజేషన్ విధానంలో కేటగిరీల వారీగా పేపర్2కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. పేపర్1+పేపర్2లో చూపిన ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలుస్తారు.

పరీక్ష విధానం :
పేపర్-1..
200 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం: రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. పేపర్ 1లో మూడు విభాగాలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులకు; జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులతోపాటు కోర్ సబ్జెక్టు 100 మార్కులు కేటాయించారు.
పేపర్-2 డిస్క్రిప్టివ్ తరహాలో జరుగుతుంది. ఇది 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమ యం 2గంటలు. సివిల్/స్టక్చ్రరల్ విభాగాల కు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రిక ల్ విభాగానికి దరఖాస్తు చేసుకు న్నవారు పా ర్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసు కున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి.

ప్రిపరేషన్ ఇలా..
 • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలి టీ, ఎకానమీ, అవార్డులు-నియామకాలు, క్రీడ లు-విజేతలు తదితర అంశాలను చదవాలి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయా బ్రాంచ్‌ల టెక్నికల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • ఎలక్ట్రికల్: సర్క్యూట్లలోని బేసిక్ ప్రిన్సిపుల్స్, బేసిక్ ఫార్ములాలు, వాటి యూనిట్లు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అంశాలపై అవగాహన అవసరం.
 • సివిల్ ఇంజనీరింగ్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్,సర్వేయింగ్ వంటి అంశా లకు సంబంధించిన ప్రిన్సిపుల్స్, ఫార్ములాలు, యూనిట్లపై అవగాహన పెంచుకోవాలి.
 • మెకానిక్స్: థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్, హీట్ ఇంజన్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. వీటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను చూసుకోవాలి. ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టుల కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ఒకచోట రాసుకొని రివిజన్ చేస్తుండాలి. సమయపాలనను అలవరచుకో వడం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి. చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.

ముఖ్య సమాచారం:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
2019 సెప్టెంబర్ 12
దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
 • కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
Published on 8/28/2019 3:39:00 PM
టాగ్లు:
Staff Selection Commission Junior Engineer (JE) posts SSC JE notification SSC JE exam syllabus SSC JE exam dates SSC JE exam process SSC JE applications SSC junior engineer preparation SSC junior engineer preparation tips central water commission posts

Related Topics