Sakshi education logo

వేదాంతం రాధేశ్యాంకు సంగీత నాటక అకాడమీ అవార్డు

Join our Community

facebook Twitter Youtube
న్యూఢిల్లీ: కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మకంగా అందించే అకాడమీ అవార్డుకు 2014 సంవత్సరానికి గాను ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడు, కళారత్న అవార్డుగ్రహీత వేదాంతం రాధేశ్యాం ఎంపికయ్యారు. ఈ అవార్డు ప్రకటించగానే కృష్ణాజిల్లా కూచిపూడివాసులు సంబరాలు చేసుకున్నారు. అకాడమీ ఫెలోషిప్, అకాడమీ అవార్డులను కేంద్ర సంగీత నాటక అకాడమీ జూన్ 12న ప్రకటించింది.
Current Affirsప్రముఖ సంగీతకారుడు ఎస్‌ఆర్ జానకిరామ్, దర్శకుడు ఎమ్‌ఎస్ సత్యు, గాయకుడు విజయ్ కి చ్లు, సంగీత దర్శకుడు తులసీదాస్ బొర్కార్‌లు అకాడమీ ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు. సంగీతం, నృత్యం, రంగస్థలం తదితర రంగాలకు చెందిన మరో 36 మందిని సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ 40 మంది మాత్రమే ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కింద తామ్ర పత్రంతో పాటు ఫెలోషిప్‌నకు రూ. 3లక్షలు, అకాడమీ అవార్డుకు రూ. లక్ష నగదు బహుమతి అందజేస్తారు.

పురస్కారాలు ఎన్నెన్నో...
వేదాంతం రాధేశ్యామ్ 1954లో జన్మించారు. సత్యభామగా, గొల్లభామగా, సూత్రధారిగా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన ఆయన అనేక పురస్కారాలను పొందారు. 2011లో నందన పురస్కారం, 2013లో హంస అవార్డు, 2014లో పసుమర్తి కృష్ణమూర్తి మెమోరియల్ జీవన సాఫల్య పురస్కారం, అదే ఏడాది పీవీజీ కృష్ణశర్మ స్మారక పురస్కారం కైవసం చేసుకున్నారు. కూచిపూడి నాట్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడంలో ముఖ్య పాత్ర పోషించారు. రాధేశ్యాం శ్రీసిద్ధేంద్ర కళాక్షేత్రంలో అధ్యాపకుడిగా పనిచేసి 2013లో ఉద్యోగ విరమణ చేశారు.
Published on 6/13/2015 4:46:00 PM

Related Topics