Sakshi education logo

Advertisement

తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ

హైదరాబాద్: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్)’ను జూన్ 12న కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు హాజరైన సదస్సులో సీఎం కేసీఆర్ నూతన విధానంలోని ప్రత్యేకతలను వివరించారు. టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌తో పాటు సోలార్ పవర్ పాలసీని సీఎం చే తుల మీదుగా ఆవిష్కరించారు.
Current Affirsప్లగ్ అండ్ ప్లే విధానం..
‘అవాంతరాలు, అవినీతి లేని రీతిలో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక విధానం ఉంటుంది. పైరవీలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా వ్యాపారం చేసుకునేలా అనుమతులు ఇస్తాం’ అని సీఎం హామీ ఇచ్చారు.

ప్రత్యేక ప్రొటోకాల్ బృందాలు..
‘ప్రపంచంలోని ఏమూలనుంచైనా అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానం ఉంటుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక ప్రోటోకాల్ అధికారుల బృందం మీకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారి చిత్తశుద్ధిని పరిశీలించి, అవాంతరాలు లేకుండా చూసేందుకు స్వయంగా భేటీ అవుతా’ అని సీఎం ప్రకటించారు. నీరు, భూమి, విద్యుత్తు తదితర అనుమతులను 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అన్నీ ఒకే ప్యాకెట్లో పెట్టి స్వయంగా అందజేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అనుమతుల్లో ఆలస్యానికి బాధ్యులయ్యే ఉద్యోగులకు రోజుకు వేయి రూపాయల చొప్పున జరిమానా విధిస్తామన్నారు.
Published on 6/13/2015 4:49:00 PM

Related Topics