తెలంగాణ డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్


సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. అతి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస కమిషన్ చర్యలు వేగవంతం చేసింది.
Education News8,452 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేసింది. దీంతో రెండు మూడ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఆర్థిక శాఖ తాజాగా అందులో 340 పోస్టులకు కోత పెట్టింది. ముందుగా కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలని భావించారు. కానీ జోనల్ వ్యవస్థ రద్దు కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన అధికారులు ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో పాత జిల్లాల వారీగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Published on 9/8/2017 11:59:00 AM
టాగ్లు:
Telangana fin min approved dsc notification TS DSC recruitment 2017 TS DSCnotification soon TS DSC- 2017 8452 teacher posts at TSDSC TS DSC notification likely in two days

Practice Papers

Related Topics