Sakshi education logo

ఆంధ్రప్రదేశ‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా...మార్చి 31 త‌ర్వాతే కొత్త షెడ్యూల్‌

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మార్చి 24న‌ ప్రకటించారు.
Edu news రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 24 ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో మొదటిసారి వాయిదా వేశారు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి వాయిదాపడ్డాయి.
Published on 3/24/2020 12:43:00 PM

సంబంధిత అంశాలు