మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 192 ఇంగ్లిష్ మీడియం మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Education News2017-18లో చేపట్టనున్న ప్రవే శాల కోసం ఫిబ్రవరి 26వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ డెరై క్టర్ కిషన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్‌‌స ద్వారా) దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడించారు. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, 7 నుంచి 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు 26వ తేదీ నాడే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. ఈ పరీక్ష ద్వారా ఒక్కో స్కూల్‌లోని ఆరో తరగతిలో 100 సీట్ల చొప్పున మొత్తంగా 19,200 సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించారు. 7 నుంచి 10వ తరగతిలో మాత్రం ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేస్తామని వివరించారు. అడ్మిషన్ ఫీజు కింద ఓసీ విద్యార్థులు రూ. 100, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. ఫీజు చెల్లింపు విధానం, దరఖాస్తుల వివరాలను ఈ నెల 16వ తేదీ నుంచి తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అందులోని సూచనల ఆధారంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 126 మోడల్ స్కూళ్లలో బాలికలకు హాస్టళ్లు ఉన్నాయని, వచ్చే మే నెలాఖరు నాటికి మరిన్ని మోడల్ స్కూళ్లలో బాలికల హాస్టళ్లు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఒక్కో హాస్టల్‌లో 100 మంది బాలికలకు నివాస వసతి ఉంటుందని వెల్లడించారు.

ఇదీ షెడ్యూలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు:
ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు.
రాత పరీక్ష: ఫిబ్రవరి 26న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు (6వ తరగతికి), మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు (7 నుంచి 10 తరగతులకు).
మెరిట్ జాబితాల ప్రకటన: మార్చి 9వ తేదీన
జిల్లా స్థాయిలో ప్రవేశాల తుది జాబితా ఖరారు: మార్చి 10వ తేదీన
సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రవేశాలు: మార్చి 17, 18 తేదీల్లో మధ్యాహ్నం
Published on 1/7/2017 2:56:00 PM
టాగ్లు:
Model school in Telangana Model school admission test in Telangana TS Model school admission testexam date Telangana education department English medium model schools Model schools seats in Telangana Online apply for Model schools admissions Model schools entrance Test in Telanagana Last date for Model schools entrance Test

సంబంధిత అంశాలు