Sakshi education logo

Advertisement

బిట్‌శాట్-2017 నోటిఫికేషన్ విడుదల

ఇంజనీరింగ్ కోర్సులకు జాతీయ స్థాయిలో పేరొందిన పరీక్ష.. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్). ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా బిట్స్ పిలానీ (రాజస్థాన్), బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌ల్లో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మూడు క్యాంపస్‌ల్లో ఉన్న దాదాపు మూడు వేల సీట్లకు ఏటా లక్షల్లో పోటీ ఉంటోంది. 2017-18కు సంబంధించి బిట్‌శాట్-2017 నోటిఫికేషన్ విడుదల చేశారు.
Adminissionsఅర్హతలు, పరీక్ష విధానం, తదితర వివరాలు...
బిట్స్ పిలానీ - పిలానీ, గోవా, హైదరాబాద్
బీఈ:
కెమికల్, సివిల్ (పిలానీ, హైదరాబాద్), కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్; మ్యానుఫ్యాక్చరింగ్ (పిలానీ, హైదరాబాద్); ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (హైదరాబాద్, గోవా).
బీఫార్మ్ (పిలానీ, హైదరాబాద్).
ఎంఎస్సీ: బయలాజికల్ సెన్సైస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్; జనరల్ స్టడీస్ (పిలానీ క్యాంపస్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)లో ప్రతి సబ్జెక్టులో 60 శాతం మార్కులు రావాలి. మొత్తం మీద 75 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. 2015కు ముందు ఇంటర్ పూర్తిచేసినవారు అర్హులు కాదు.

పరీక్ష విధానం :
ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో బిట్‌శాట్ నిర్వహిస్తారు. నాలుగు విభాగాల నుంచి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 450 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

 

సబ్జెక్టు

ప్రశ్నలు

పార్ట్-1

ఫిజిక్స్

40

పార్ట్-2

కెమిస్ట్రీ

40

పార్ట్-3

(ఎ)ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ

15

(బి) లాజికల్ రీజనింగ్

10

పార్ట్-4

మ్యాథ్స్/ బయాలజీ

45

పార్ట్-4లో అభ్యర్థులు తమ ఔత్సాహిక కోర్సు ఆధారంగా సంబంధిత పేపర్‌కు హాజరవాలి.. బీఫార్మసీ విద్యార్థులు బయాలజీ పేపర్‌కు, బీటెక్ ఔత్సాహికులు మ్యాథ్స్ పేపర్ రాయాలి.

ప్రత్యేకం.. పార్ట్-3:
ఇతర ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లతో పోల్చితే బిట్‌శాట్ ప్రత్యేకం. ఎందుకంటే పరీక్షలో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లను చేర్చడం. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను తెలుసుకోవడానికే పరిమితం కాకుండా అభ్యర్థుల్లోని కమ్యూనికేషన్ స్కిల్స్, థింకింగ్ ఎబిలిటీస్‌ను పరిశీలించే ఉద్దేశంతో వీటిని పొందుపర్చారు. ఈ విభాగంలో రాణించడానికి పదో తరగతి స్థాయిలో ఇంగ్లిష్ గ్రామర్‌పై, వొకాబులరీపై పట్టుంటే 25 ప్రశ్నలకు సులువుగా సమాధానం ఇవ్వొచ్చు.

బేసిక్స్‌పై అవగాహన.. తులనాత్మక దృక్పథం :
విద్యార్థులు ముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత జేఈఈ ప్రిపరేషన్‌తో బిట్‌శాట్‌ను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ఒకే సమయంలో రెండు పరీక్షలకు ప్రిపరేషన్ సాగించొచ్చు.
  • పతి సబ్జెక్ట్‌లోనూ ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. దీనివల్ల రివిజన్ సులువుగా ఉంటుంది.
  • కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రాసుకోవాలి.
  • ఫిజిక్స్‌లో వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి.
  • మ్యాథమెటిక్స్‌లో హైపర్‌బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రిల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

బోర్డ్ టాపర్స్.. డెరైక్ట్ అడ్మిషన్స్
ఇంటర్మీడియెట్ స్థాయిలో ఆయా బోర్డ్‌ల టాపర్స్‌గా నిలిచిన అభ్యర్థులకు నేరుగా వారు కోరుకున్న బ్రాంచ్‌లో సీటు కల్పిస్తున్నారు. గత ఐదేళ్లలో దాదాపు ఆయా బోర్డ్‌లలో టాపర్స్‌గా నిలిచిన 40 మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమే ఇందుకు నిదర్శనం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 6, 2017
ఆన్‌లైన్ టెస్ట్ తేదీలు: మే 16, 2017 నుంచి మే 30, 2017
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.bitsadmission.com/

బిట్‌శాట్ - 2016 కటాఫ్‌లు..
మొత్తం మూడు క్యాంపస్‌లలోని బీటెక్ బ్రాంచ్‌లు గత ఏడాది (బిట్‌శాట్-2016) కటాఫ్ స్కోర్లవివరాలు..

బ్రాంచ్

పిలానీ

గోవా

హైదరాబాద్

కెమికల్

319

301

298

సివిల్

314

--

303

ఎలక్ట్రికల్ - ఎలక్ట్రానిక్స్

362

331

324

మెకానికల్

346

322

316

మ్యాన్యు ఫ్యాక్చరింగ్

311

--

298

బీఫార్మసీ

240

--

224

సీఎస్‌ఈ

384

358

347

ఎలక్ట్రానిక్స్ -ఇన్‌స్ట్రుమెంటేషన్

345

312

313

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్

--

--

332


ప్రాధాన్యత క్రమంలో అప్రమత్తంగా :
బిట్‌శాట్ ముగిసిన తర్వాత అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్, క్యాంపస్‌ల ప్రాధాన్యత క్రమాన్ని ఆన్‌లైన్‌లో పేర్కొనాలి. ఈ క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గత కటాఫ్ స్కోర్లను పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం తాము పొందగలిగే మార్కులను బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమం పూర్తి చేయాలి. ఇక ఆన్‌లైన్ టెస్ట్ విషయంలో సమర్థంగా రాణించడానికి వీలైనన్ని మాక్ టెస్టులు, ఆన్‌లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి.
- ప్రొఫెసర్. బి. ఉదయ్‌కుమార్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్
Published on 1/10/2017 4:18:00 PM

సంబంధిత అంశాలు