గ్రూప్‌–2 మెయిన్స్‌ ప్రశ్నాపత్రంలో ప్రమాణాలు కరువు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలో ప్రమాణాలు కొరవడ్డాయి.
Education News

అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడం మానేసి పరీక్షలో గందరగోళం సృష్టించడమే పనిగా పెట్టుకుంది ఏపీపీఎస్సీ. ప్రశ్నల రూపకల్పనలో అస్పష్టత, ఆప్షన్స్‌లలో గజిబిజి పదాలు, అనువాద దోషాలు వంటి వాటితో ఎప్పటిలాగే గందరగోళం సృష్టించి అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహలు నింపింది. సుదీర్ఘ సిలబస్‌ పేర్కొన్నప్పటికీ పరీక్షలో మాత్రం ఏవో తోచిన ప్రశ్నలు ఇచ్చింది. కొన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలే రాలేదు. కొన్ని సిలబస్‌ పరిధి దాటి ఇచ్చినట్లుంది.


కటాఫ్‌ మార్కుల అంచనా తెలుసుకోండిలా..
 

ఇలా ఏవేవో ప్రశ్నలు ఇచ్చేటప్పుడు చాంతాడంతా సిలబస్‌ ఎందుకు? ప్రశ్నలు ఎక్కడి నుంచైనా అడగొచ్చు అంటే జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకునే ప్రయత్నం చేస్తారు అభ్యర్థులు. అవును పోటీ ఉంది. వడబోయాలి. మరీ ఇంతలా ప్రశ్నాపత్రం రూపొందించి అభ్యర్థులను బెంబేలెత్తించాలా? అసలు చేసే ఉద్యోగానికి, చదివే చదువుకు సంబంధం లేకుండా ప్రశ్నలు రూపొందిస్తే అభ్యర్థులు ఏమైపోతారు? అని విజయవాడకు చెందిన ఒక అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు.

దీనికి తోడు ఇంగ్లిష్‌లో ప్రశ్నలు మరీ అస్పష్టంగా పేర్కోవడం కూడా అభ్యర్థులకు నష్టదాయకం. అనువాద దోషాల వల్ల ప్రతి ప్రశ్నకు ఇంగ్లిష్‌లో వెరిఫై చేసే సరికి సగం సమయం ఖాళీ. ఇలా అభ్యర్థులను మానసికంగా దెబ్బతీసి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏముంది? అనేది అభ్యర్థుల వాదన.

Published on 7/19/2017 12:55:00 PM
టాగ్లు:
Group-2 mains 2017 review review on group-2 mains exam review on group-2 mains questions APPSC group-2 mains review Question paper standard

సంబంధిత అంశాలు