Sakshi education logo

Advertisement

ఇంగ్లిష్, తెలుగు మీడియాలకు వేర్వేరు పరీక్షలే : టీఎస్‌పీఎస్సీ

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులు ఇంగ్లిష్ మీడియం, తెలుగు మీడియానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది.
Education Newsగతంలో ఏదైనా ఒకే మీడియానికే దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు ఒకే అభ్యర్థికి రెండింటికీ అర్హతలుంటే రెండింటికీ దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టింది. రెండు మీడియాలకు వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీంతో అభ్యర్థులు రెండు మీడియాల పోస్టులకు వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి వేర్వేరుగానే హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్: వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఎస్‌జీటీ పోస్టులకు 2018 ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. వాటికి సంబంధించిన ప్రాథమిక కీలను మార్చి 1 నుంచి 5 వరకు ప్రకటిస్తామని, వాటిపై అభ్యంతరాలను అదే నెల 2 నుంచి 10 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ కీని మార్చి 25న ప్రకటించి, ఏప్రిల్ 16 నుంచి 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వివరించింది. పోస్టులకు ఎంపిైకై న వారి జాబితాలను మే 10న ప్రకటించనున్నట్లు వివరించింది.
Published on 12/29/2017 2:14:00 PM

సంబంధిత అంశాలు