Sakshi education logo

Advertisement

ఇండియన్ నేవీలో2700 సెయిలర్ ఉద్యోగాలు

ఇండియన్ నేవీలో వివిధ విభాగాల్లో 2700 సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చిన్నవయసులోనే ఇంటర్ అర్హతతోనే భారత నౌకాదళంలో చేరే వీలు కల్పిస్తోంది ఈ ప్రకటన. సెయిలర్ ఫర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్‌ఎస్‌ఆర్), సెయిలర్ ఫర్ ఆర్టిఫిసెర్ అప్రెంటీస్(ఏఏ)-ఫిబ్రవరి, 2020 బ్యాచ్‌కు అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ‘సెయిలర్లు’ నేవీకి ప్రధాన మానవ వనరులు. ఎంపికయ్యే ట్రేడ్‌ను బట్టి ‘సెయిలర్స్’ కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Jobsపోస్టులు-ఖాళీలు..
ఆర్టిఫిసెర్ అప్రెంటీస్ (ఏఏ): 500
సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్‌ఎస్‌ఆర్): 2200
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2000, ఫిబ్రవరి 1 నుంచి 2003, జనవరి 31 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక విధానం :
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్(పీఎఫ్‌టీ), మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
  • కంప్యూటర్ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్.. ఇలా నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం గంట. ప్రతి సెక్షన్‌లో వేర్వేరుగా అర్హత సాధించడంతోపాటు మొత్తంగా కూడా నిర్దేశిత మార్కులు సాధించాలి.
  • రుణాత్మక మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. పరీక్షల సిలబస్‌ను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. www.joinindiannavy.gov.in వెబ్‌సైట్లో ఏఏ, ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులకు సంబంధించిన సిలబస్‌ను వేర్వేరుగా పేర్కొన్నారు. పూర్తి సిలబస్, శాంపిల్ పేపర్లను వెబ్‌సైట్లో చూడొచ్చు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
 రాతపరీక్షలో అర్హులకు పీఎఫ్‌టీ ఉంటుంది. ఈ టెస్ట్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. ఇందులో 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తగలగాలి. 20 సిట్‌అప్స్(ఉటక్ బైటక్), 10 పుష్-అప్స్ తీయగలగాలి.
 
 మెడికల్ ఎగ్జామినేషన్ :
 కనీసం 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు, ఛాతీ ఉండాలి. ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు వ్యాకోచించాలి. దీంతోపాటు నిబంధనలు మేరకు దృష్టి సామర్థ్యం, ఆరోగ్యం తప్పనిసరి.
 
 స్టైపెండ్-వేతనం :
 సెయిలర్ ఫర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్‌ఎస్‌ఆర్) శిక్షణలో రూ.14,600 స్టైపెండ్ లభిస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత పేబ్యాండ్ రూ.21,700-రూ.69,100 ఉంటుంది. గ్రేడ్ పే, ఎంఎస్‌పీ, డీఏ వంటివి అదనంగా ఉంటాయి.
 
 ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 10,2019
దరఖాస్తు రుసుం: రూ.205 (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
పరీక్షలు సెప్టెంబర్/అక్టోబర్‌లో జరిగే అవకాశముంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
Published on 7/10/2019 12:27:00 PM

సంబంధిత అంశాలు