Sakshi education logo

Advertisement

వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి విధి-విధానాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయ ఉద్యోగాలకు సమర్ధులు, ప్రతిభావంతులనే ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Jobs
ఈ ఉద్యోగాలకు నిర్వ‌హించే పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో పలుమార్లు సమీక్షలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డుగా నిలిచిపోయే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూలై 19న జరిగిన కేబినెట్ సమావేశంలో అభ్యర్థుల విధులు, అర్హతలు నిర్ణయించారు. దాదాపు 1.30లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నియామకాలు జరగనుండగా.. 2.80లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా పనిచేసే వలంటీర్లను నియమిస్తారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు తొలుత ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా కంప్యూటర్ల ఏర్పాటులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంతో రాత పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షకు ఇంటర్మీడియట్, ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించే అధికారుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

వార్డు సచివాలయాల్లో పరీక్ష ఇలా..
వార్డు సచివాలయాల పరీక్షకు మొత్తం 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 50 మార్కులు ఎంపిక చేసిన సిలబస్, 50 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, 50 మార్కులు జనరల్ నాలెడ్జికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తున్నారు. ఓఎంఆర్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. అలాగే, పక్కా డ్రెయిన్లు, రహదారుల నిర్మాణాలు, మరమ్మతులు వంటి విధులు నిర్వహించే అభ్యర్థులకు బీటెక్‌ను విద్యార్హతగా నిర్ణయించారు. ఇటువంటి అభ్యర్థులకు ఇంజనీరింగ్‌కు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 100 మార్కులు వ్యక్తిత్వ సామర్థ్యం, జనరల్ నాలెడ్జ్జికి సంబంధించినవి ఉంటాయి. పరీక్షకు రెండున్నర గంటల సమయాన్ని కేటాయించారు. పరీక్షలో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష అనంతరం ఎటువంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ పోస్టులకు 18ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అదే విధంగా గరిష్ట వయో పరిమితిని 42ఏళ్లుగా నిర్ణయించినట్టు సమాచారం. రిజర్వేషన్లు యథావిధిగా అమలులో ఉంటాయి.

పట్టణ సచివాలయల్లో ఉద్యోగ హోదా, విద్యార్హతలు :

నం.

ఉద్యోగ హోదా

విద్యార్హతలు

1. వార్డు కార్యదర్శి (సాధారణ పరిపాలన) డిగ్రీ,ఎంఎస్‌ఆఫీసులోసర్టిఫికెట్
2. వార్డు మౌలిక వసతుల కార్యదర్శి బీఈ లేదా బిటెక్ లేదా ఏఎంఈఈ (సివిల్), ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
3. వార్డు ఇంధన కార్యదర్శి బీఈ లేదా బీటెక్, ఏఎంఈఈ(ఎలక్ట్రికల్),ఎంఎస్‌ఆఫీసులో సర్టిఫికెట్
4. వార్డు శానిటేషన్ కార్యదర్శి సైన్స్ లో గ్రాడ్యుయేట్ లేదాపర్యావరణంలో ఇంజినీరింగ్, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
5. వార్డు ఆరోగ్య కార్యదర్శి డిగ్రీ,ఎంఎస్‌ఆఫీసులోసర్టిఫికెట్
6. వార్డు విద్య కార్యదర్శి డిగ్రీ,బీఈడీ,ఎంఈడీ,ఎడ్యుకేషన్ అభ్యర్థులకుప్రాధాన్యత, ఎంఎస్ ఆఫీస్‌లో సర్టిపికెట్
7. వార్డు ప్లానింగ్ కార్యదర్శి బీఈ లేదా బీటెక్, లేదా ప్లానింగ్‌లో డిగ్రీ, ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు ప్రాధాన్యత. ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
8. వార్డు రెవిన్యూ కార్యదర్శి డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్, సర్వే డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత
9. వార్డు మహిళా కార్యదర్శి బ్యాచిలర్ ఆఫ్ లా లేదా ఎల్‌ఎల్‌బి., ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
10. వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీ సోషల్ వర్క్‌లో డిగ్రీ, ఎంఎస్ ఆఫీసులో సర్టిఫికెట్
Published on 7/20/2019 2:23:00 PM

సంబంధిత అంశాలు