Sakshi education logo

Advertisement

78 డిగ్రీ కాలజీల్లో జీరో అడ్మిషన్లు..!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ఒక్క విద్యార్థీ చేరని కాలేజీల సంఖ్య పెరిగింది. ఇలాంటి కాలేజీలు గతేడాది 54 ఉండగా, ఈసారి 78కి చేరినట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. ఆయా కాలేజీల్లోని 727 కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు.
Edu news మొత్తంగా ఆయా కాలేజీలతోపాటు మరికొన్ని కాలేజీల్లోని పలు కోర్సుల్లో 39,775 సీట్లు ఉండగా వాటిల్లో ఒక్క విద్యార్థి చేరలేదని అధికారులు గుర్తించారు. అయితే ఒక్క విద్యార్థి చేరని కోర్సులను వదిలేసి డిమాండ్ ఉన్న కోర్సులను పెంచుకునేలా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.

కేయూలో అత్యధికం...
తెలంగాణలోని ఆరు యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ద్వారా 987 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని 3,86,684 సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 1,76,039 సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ కాలేజీల్లో 78,519 సీట్లు అందుబాటులో ఉండగా, 44,151 సీట్లు నిండాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసం త్వరలో మరో దశ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన నాలుగు దశల కౌన్సెలింగ్‌లో 78 కాలేజీల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు. వీటిలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలే అధికం. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోవే ఎక్కువ.

యూనివర్సిటీల పరిధిలో ఒక్క విద్యార్థి చేరని కాలేజీలు..
కాకతీయ వర్సిటీ 26
ఉస్మానియా వర్సిటీ 18
మహాత్మాగాంధీ వర్సిటీ 13
తెలంగాణ వర్సిటీ 6
శాతవాహన వర్సిటీ 10
పాలమూరు వర్సిటీ 5

బీసీలే అత్యధికం...

తెలంగాణలోనిడిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 4 దశల కౌన్సెలింగ్‌లో అత్యధికంగా 99,666 బీసీ విద్యార్థులు చేరారు. వీరిలో బీసీ-డీ విద్యార్థులు 39,777 మంది ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. డిగ్రీలో సీట్లు పొందిన విద్యార్థుల్లో బీసీలు 56.61 శాతం ఉండగా, ఓసీ విద్యార్థులు 18.62 శాతం ఉన్నారు. ఎస్సీ విద్యార్థులు 15.73 శాతం డిగ్రీ కాలేజీల్లో చేరగా, ఎస్టీ విద్యార్థులు 9.03 శాతం మంది డిగ్రీలో కోర్సుల్లో చేరినట్లు లెక్క తేలింది.

కేటగిరీల వారీగా చేరిన విద్యార్థులు..
బీసీ-ఏ 5,247
బీసీ-బీ 3,317
బీసీ-సీ 426
బీసీ-డీ 9,777
బీసీ-ఈ 0,899
ఓసీ 2,786
ఎస్సీ 7,699
ఎస్టీ 5,888
Published on 8/7/2019 3:00:00 PM

సంబంధిత అంశాలు