Sakshi education logo

ఆగస్టు 16న ఫార్మర్స్‌ కోటా ఫైనల్‌ కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: బీటెక్‌ (అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులలో మొదటి కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి ఎంపీసీ స్ట్రీం ఫార్మర్స్‌ కోటా ఫైనల్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 16న ఉదయం 10 గంటలకు ఎగ్జామినేషన్‌ సెంటర్‌లో నిర్వహిస్తామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు.
Edu news

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూపు చదివి తెలంగాణ ఎంసెట్‌–2019 (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌)లో మెరిట్‌ సాధించి యూనివర్సిటీలో ఫార్మర్స్‌ కోటాకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థులు సీటు పొందిన వెంటనే రూ. 36,450 ఫీజు చెల్లించాలని, లేనిచో అడ్మిషన్‌ రద్దవుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.in సంప్రదించాలని సూచించారు.

 

 

 

 

Published on 8/10/2019 1:52:00 PM

సంబంధిత అంశాలు