Sakshi education logo

ఉన్నత విద్యా ప్రవేశాల్లోనూ.. జీవో 550 అమలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జీవో 550ని అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 12వ తేదీనఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నంబర్ 111ను విడుదల చేశారు.
Edu newsఇప్పటివరకు ఉన్న విధానానికి బదులు ఆయా విద్యాసంస్థల్లో ఓపెన్ కేటగిరీ సీట్ల భర్తీని జీవో 550 ప్రకారం చేయనున్నారు. కొత్త విధానం ప్రకారం ఓపెన్ కేటగిరీ సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లతో పనిలేకుండా ఓపెన్ మెరిట్‌లో వచ్చిన అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మెరిట్‌లో ఉండే అభ్యర్థి  రిజర్వుడ్ కేటగిరీకి చెందిన వారే అయినా ఓపెన్ కేటగిరీలోనే సీటు కేటాయిస్తారు. ఆ అభ్యర్థి వెబ్ కౌన్సెలింగ్‌లో కేటాయింపు అయ్యే ఆ సీటును కాకుండా అంతకన్నా మంచి బ్రాంచిని, కాలేజీని కోరుకుని ఆప్షన్ ఇచ్చుకుంటే కనుక ఆ అభ్యర్థికి ఆ సీటును రిజర్వుడ్ కేటగిరీలో కేటాయిస్తారు. ఇందులో భాగంగా అలా సీటు పొందిన అభ్యర్థి ఖాళీ చేసే ఓపెన్ కేటగిరీ సీటును అదే రిజర్వుడ్ కేటగిరీకి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు. 
Published on 8/14/2019 3:56:00 PM

సంబంధిత అంశాలు