Sakshi education logo

Advertisement

ఏపీ సెట్ దరఖాస్తుకు సెప్టెంబర్ 11తో ఆఖరు

ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) దరఖాస్తుకు సెప్టెంబర్ 11వ తేదీతో గడువు ముగియనుందని ఏపీ సెట్ మెంబర్ సెక్రెటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు సెప్టెంబర్ 1న ఒక ప్రకటనలో తెలిపారు.
Edu news రూ.1,000 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 19వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో సెప్టెంబర్ 26వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఆక్టోబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 20వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.1,200, బీసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 పరీక్ష ఫీజుగా చెల్లించాలన్నారు. మెత్తం 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం  www.andhrauniversity.edu.in , www.apret.in/ వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చన్నారు.
Published on 9/3/2019 4:28:00 PM

సంబంధిత అంశాలు