Sakshi education logo

పాఠశాల విద్యా ప్రమాణాల్లో ఏపీకి 4వ స్థానం

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్యా ప్రమాణాల విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న విధానాలకు నీతి ఆయోగ్ ర్యాంకులు ఇచ్చింది.
 
Edu news
పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను విభజించి 2016-17 గణాంకాల ప్రకారం ఈ ర్యాంకులను ప్రకటించింది. 30 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో దేశంలోనే కేరళ మొదటి స్థానం దక్కించుకుంది. రాజస్థాన్ రెండో స్థానంలో, కర్ణాటక మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి.

పాఠశాల విద్యా ప్రమాణాల్లో రాష్ట్రాల బలాలు, బలహీనతలు తెలియజేయడం, లోటుపాట్లను సరిదిద్దుకొనేలా రాష్ట్రాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ నివేదికను విడుదల చేసినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. మెరుగైన ప్రమాణాలు అమలు చేస్తున్న రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తితో అనుసరించాలని ఆకాంక్షించింది.
Published on 10/1/2019 3:48:00 PM

సంబంధిత అంశాలు